Begin typing your search above and press return to search.

డెకాయిట్ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన మృణాల్

ఈ నేప‌థ్యంలోనే మృణాల్ డెకాయిట్ గురించి అప్డేట్ ఇచ్చింది. పేప‌ర్ వెయిట్‌ను చేత్తో గుండ్రంగా తిప్పుతూ తాను డెకాయిట్ షూట్ లో ఉన్న విష‌యాన్ని వెల్ల‌డించింది మృణాల్.

By:  Tupaki Desk   |   25 Feb 2025 10:28 AM GMT
డెకాయిట్ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన మృణాల్
X

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో చిర‌స్థానాన్ని సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ మొద‌టి సినిమాతోనే మంచి స‌క్సెస్ అందుకుంది. అయితే మృణాల్ చివ‌ర‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఆడియ‌న్స్ ను ప‌ల‌క‌రించింది. ప్ర‌స్తుతం మృణాల్ అడివి శేష్ తో క‌లిసి డెకాయిట్ సినిమాలో న‌టిస్తోంది.

ఈ సినిమాలో మృణాల్ ఫ‌స్ట్ లుక్ ను చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. మృణాల్ ఫ‌స్ట్ లుక్ త‌ర్వాత డెకాయిట్ నుంచి ఎలాంటి అప్డేట్ వ‌చ్చింది లేదు. దీంతో ఈ సినిమా అప్డేట్స్ తెలుసుకోవాల‌ని ఆడియ‌న్స్ ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే మృణాల్ డెకాయిట్ గురించి అప్డేట్ ఇచ్చింది. పేప‌ర్ వెయిట్‌ను చేత్తో గుండ్రంగా తిప్పుతూ తాను డెకాయిట్ షూట్ లో ఉన్న విష‌యాన్ని వెల్ల‌డించింది మృణాల్.

ఇప్ప‌టివ‌ర‌కు రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా సినిమాల్లో న‌టించిన మృణాల్ కు ఈ సినిమా పూర్తి భిన్నంగా ఉండ‌నుంది. మృణాల్ న‌టిస్తున్న మొద‌టి థ్రిల్ల‌ర్ సినిమా డెకాయిట్‌. ఫ‌స్ట్ లుక్ లో మృణాల్ ను చూసి షాకైన అభిమానులు ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో అమ్మడిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. పోస్ట‌ర్ లో మృణాల్ లుక్ చాలా భీక‌రంగా క‌నిపించ‌డంతో డెకాయిట్ పై ఉన్న అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.

ఇదిలా ఉంటే డెకాయిట్ మూవీతో షానీల్ డియో ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాబోతున్నాడు. సుప్రియ యార్ల‌గ‌డ్డ‌, సునీల్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందుతుంది. తనకు ద్రోహం చేసిన తన ఎక్స్ లవర్ పై ప్రతీకారం తీర్చుకునే కోపంతో ఉన్న దోషి కథగా డెకాయిట్ ఉండ‌బోతుంది. ఈ సినిమాపై అడివి శేష్, మృణాల్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. వాస్త‌వానికి ఈ సినిమా ముందుగా శృతి హాస‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. టీజ‌ర్ కూడా రిలీజ్ చేసిన త‌ర్వాత కొన్ని కార‌ణాల వ‌ల్ల శృతి త‌ప్పుకోవడంతో ఆ ప్లేస్‌లోకి మృణాల్ వ‌చ్చింది.