Begin typing your search above and press return to search.

సైమా అవార్డ్స్.. ఊరిస్తున్న టాలీవుడ్ సీత!

తాజాగా మృణాల్ క్రేజీ పిక్ ను పోస్ట్ చేసింది. లెట్స్ గో.. సైమా అవార్డ్స్.. ఎక్సైటెడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఫ్లైట్ లో వెళుతున్న పిక్ ను షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   14 Sep 2024 12:11 PM GMT
సైమా అవార్డ్స్.. ఊరిస్తున్న టాలీవుడ్ సీత!
X

టాలీవుడ్ సీత.. అదేనండీ మృణాల్ ఠాకూర్.. తన తెలుగు డెబ్యూ మూవీ సీతారామంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. హను రాఘవపూడి తెరకెక్కించిన ఆ సినిమాతో టాలీవుడ్ సీతగా పేరు సంపాదించుకుంది. దుల్కర్ సల్మాన్ సరసన సీతామహాలక్ష్మిగా నటించి తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది. తెలుగులో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ దక్కించుకుంది అమ్మడు. వరుస అవకాశాలు వచ్చినా.. ఆచితూచి సెలెక్ట్ చేసుకుంది.

సీతారామం తర్వాత తెలుగులో హాయ్ నాన్న సినిమా చేసింది మృణాల్. నానికి జోడీగా యాక్ట్ చేసి తన నటనతో టాలీవుడ్ లవర్స్ ను మెప్పించింది. అనంతరం స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హ్యాట్రిక్ అందుకుంటుందని అంతా అనుకుంటే.. తెలుగులో ఫస్ట్ ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకుంది. రీసెంట్ గా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ప్రభాస్ కల్కి 2898 ఏడీలో క్యామియో రోల్ చేసింది.

కాగా, మృణాల్ నటిస్తున్న మరో తెలుగు సినిమా అనౌన్స్మెంట్ ఇప్పటి వరకు ఒక్కటి కూడా రాలేదు. మెగాస్టార్ విశ్వంభరలో ఆమె యాక్ట్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆమె పలు హిందీ ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతోంది. పూజా మేరీ జాన్, హై జవానీ తో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. ఆ మూడు చిత్రాలు ఇప్పుడు సెట్స్ పై ఉన్నాయి. త్వరలో ఆ ప్రాజెక్టులతో సందడి చేయనుంది.

అయితే అవార్డు వేడుకల్లో మృణాల్ ఎపీరియన్స్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. స్పెషల్ గా రెడీ అయ్యి.. వేరే లెవల్ డ్రెస్సులు వేసుకుని సందడి చేస్తుంటోంది. నెవ్వర్ బిఫోర్ అనేలా ఆకట్టుకుంటూ ఉంటోంది. ఇప్పుడు సైమా అవార్డుల్లో ఆమె లుక్ ఎలా ఉంటుందోనని అంతా ఎదురుచూస్తున్నారు. ఈగర్లీ వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఫ్యాన్స్ అంతటి వెయిటింగ్ కు కారణం ఆమె పోస్టే.

తాజాగా మృణాల్ క్రేజీ పిక్ ను పోస్ట్ చేసింది. లెట్స్ గో.. సైమా అవార్డ్స్.. ఎక్సైటెడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఫ్లైట్ లో వెళుతున్న పిక్ ను షేర్ చేసింది. అందులో ఆమె లుక్ కంప్లీట్ గా రివీల్ కానప్పటికీ.. ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్రాస్లెట్ ఆకట్టుకుంటున్నాయి. అయితే సైమా వేడుకకు ఆమె చివరి లుక్ ఇదే కానప్పటికీ.. మృణాల్ గ్రాండ్ ఎంట్రన్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు అభిమానులు చెబుతున్నారు. మరి ఆమె ఎలా రెడీ అవుతుందో వేచి చూడాలి.