మొత్తానికి మృణాల్ ఛలో ముంబై!
తెలుగులో మాత్రం అడవి శేష్ హీరోగా నటిస్తోన్న 'డెకాయిట్' లో నటిస్తోంది. మొత్తంగా మృణాల్ బాలీవుడ్ వేగం చూస్తుంటే? మకాం పూర్తిగా ముంబైకి మార్చేసినట్లు కనిపిస్తుంది.
By: Tupaki Desk | 20 March 2025 1:30 AM IST'సీతారామం' తర్వాత మృణాల్ ఠాకూర్ తెలుగులో బిజీ స్టార్ అవుతుందనుకున్నారంతా. కానీ అమ్మడి కెరీర్ టాలీవుడ్ లో అలా సాగలేదు. బాలీవుడ్ లో నూ వరుసగా నాలుగైదు సినిమాలు చేసింది. మళ్లీ ఇదే సమయంలో 'సీతారామం' ఐడెంటీతో 'ఫ్యామిలీ స్టార్' లో అవకాశం వచ్చింది. అందులో నటించింది. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు. 'కల్కి 2898'లో గెస్ట్ రోల్ పోషించింది.
అప్పటి నుంచి సీతమ్మ మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ప్రస్తుతం మళ్లీ యధావిధిగా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తోంది. అమ్మడిప్పుడు అక్కడ ఎంత బిజీగా ఉందంటే? 2025 డైరీ అంతా ఫుల్ అయింది. నాలుగైదు సినిమాలు చేతిలో ఉన్నాయి. అవన్నీ ఆన్ సెట్స్ లో ఉన్న చిత్రాలే. 'పూజా మేరీ జాన్ పోస్ట్' ప్రొడక్షన్ లో ఉంది. త్వరలోనే రిలీజ్ అవుతుంది. 'హే జవానీతో ఇష్క్ హోనా' ,' సన్నాఫ్ సర్దార్ -2', 'తుమ్ హో తూ' చిత్రీకరణ దశలో ఉన్నాయి.
తెలుగులో మాత్రం అడవి శేష్ హీరోగా నటిస్తోన్న 'డెకాయిట్' లో నటిస్తోంది. మొత్తంగా మృణాల్ బాలీవుడ్ వేగం చూస్తుంటే? మకాం పూర్తిగా ముంబైకి మార్చేసినట్లు కనిపిస్తుంది. హిందీ సినిమాలతోనే కెరీర్ అన్నట్లు ముందుకెళ్తుంది. అయితే మృణాల్ చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది. గ్లామర్ పాత్రలు పోషించాలన్నా కంటెంట్ డిమాండ్ చేయాలి. ఛాలెంజింగ్ పాత్రలు మాత్రమే పోషిస్తుంది.
క్లాసిక్ చిత్రాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది. అలాంటి పాత్రలు టాలీవుడ్ లో రేర్ గా వస్తాయి. అందుకే అమ్మడు ఇక్కడ లాభం లేదనుకుని ముంబైకి చెక్కేసింది. డెకాయిట్ తెలుగు, హిందీలో తెరకెక్కుతోన్న చిత్రం అన్న సంగతి తెలిసిందే.