'పౌజీ' కోసం వాళ్లిద్దరి మధ్యా పోటీ!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ లవ్ అండ్ వార్ `పౌజీ`ని హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 29 March 2025 7:30 AMపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ లవ్ అండ్ వార్ `పౌజీ`ని హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. 1800 ఏళ్ల కాలం నాటి పీరియాడిక్ స్టోరీలో అద్భుతమైన లవ్ స్టోరీని ఆవిష్కరి స్తున్నాడు. ఇందులో అందమైన ప్రేమ కథతో పాటు అంతకు మించి కళ్లు చెదిరే భారీ యాక్షన్ ఎపిసోడ్లు కూడా ఉంటున్నాయి. ఇందులో డార్లింగ్ కి ప్రభాస్ కి జోడీగా ఇమ్మాన్వీని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
లాంచింగ్ రోజే అమ్మడు అభిమానుల మనసులు దొచేసింది. తన అందచందాలతో నెట్టింట సంచల నమైంది. అటుపై డాన్సులో తానెంత ప్రోఫెషనల్ అన్నది ఓ వీడియో ద్వారా అర్దమైంది. అంతటి ట్యాలెం టెడ్ బ్యూటీ ఇంతకాలం ఎక్కడ ఉంది? అనే చర్చకు తెరి తీసిందంటే? ఇమాన్వీ పై ఏ రేంజ్ లో హై వచ్చిందో అర్దమవుతుంది. ఇమాన్వీలో ఇవన్నీ చూసే హను ఛాన్స్ ఇచ్చాడన్నది అంతే వాస్తవం.
అయితే ఇందులో సెకెండ్ లీడ్ కూడా ఒకటుంది. ఆ పాత్ర కోసం ఇప్పటికే మృణాల్ ఠాకూర్ ను పరి శీలిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. కానీ మృణాల్ నటిస్తే ప్రెష్ ఫీల్ రాదు ? అన్న ఆలోచనలోనూ హను ఉన్నాడుట. ఈ నేపథ్యంలోప్రత్యామ్నాయంగా బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీని పరిశీలిస్తున్నారుట. `కల్కి 2898` లో దిశా నటించిన సంగతి తెలిసిందే. తెరపై కనిపించింది కాసేపే అయినా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసింది.
ఈ నేపథ్యంలో మృణాల్ కంటే దిశా పటానీ అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారుట. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. దీంతో మృణాల్-దిశా పటానీ మధ్య ఛాన్స్ విషయంలో పోటీ కనిపిస్తుంది. మృణాల్ ఠాకూరు కూడా ఇప్పటి వరకూ ప్రభాస్ తో నటించే ఛాన్స్ రాలేదు. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఇప్పుడా ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారుతున్నట్లు కనిపిస్తుంది.