Begin typing your search above and press return to search.

మృణాల్ ఠాకూర్.. పెద్ద స్టెప్పే!!

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. తెలుగులో సీతారామం మూవీతో ఎలాంటి క్రేజ్ దక్కించుకుందో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 Jun 2024 9:50 AM GMT
మృణాల్ ఠాకూర్.. పెద్ద స్టెప్పే!!
X

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. తెలుగులో సీతారామం మూవీతో ఎలాంటి క్రేజ్ దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ఫస్ట్ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామంలో తన అందం, అభినయంతో అందరి మనసులు దోచేసింది. టాలీవుడ్ సీతగా పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చినా.. ఆచితూచి ఎంచుకుంది మృణాల్ ఠాకూర్.

సీతారామం తర్వాత.. టాలీవుడ్ నేచురల్ స్టార్ నానితో కలిసి హాయ్ నాన్న సినిమా చేసింది. ఈ మూవీతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది అమ్మడు. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మృణాల్. కానీ ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో హ్యాట్రిక్ మిస్ చేసుకుంది. అయితే సినిమాలో యాక్టింగ్ తో మాత్రం మృణాల్ మెప్పించింది.

ఫ్యామిలీ స్టార్ తర్వాత ఒక్క తెలుగు మూవీ కూడా అనౌన్స్ చేయలేదు మృణాల్. కానీ పలు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీలో కూడా మృణాల్ క్యామియో రోల్ పోషిస్తున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై మేకర్స్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా.. ఆమె సినిమాలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే కల్కిలో మృణాల్ రోల్ కోసం ఇప్పుడు నెట్టింట చర్చ నడుస్తోంది.

కల్కి సినిమాలో ఆమె తన కెరీర్ లోనే భిన్నమైన పాత్ర పోషించిందని టాక్ వినిపిస్తోంది. సినిమాలో మృణాల్ తల్లి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. భైరవ చిన్ననాటి రోల్ కు మృణాల్ తల్లిగా కనిపించనుందని సమాచారం. దీంతో ఆమె డేరింగ్ స్టెప్ వేసిందని సినీ పండితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో యువతిగా ఎలిగెంట్ రోల్స్ లో కనిపించిన మృణాల్.. ఇప్పుడు తల్లిగా నటించడం గ్రేటేనని అంటున్నారు.

అయితే నటీనటులను స్కీన్ పై పెర్ఫెక్ట్ గా చూపించడంలో నాగ్ అశ్విన్ టాలెంట్ అందరికీ తెలిసిందే. వైవిధ్యంగా అందరూ ఆకట్టుకునేలా పాత్రలను డిజైన్ చేస్తారు నాగీ. ఇప్పటికే రిలీజ్ చేసిన కల్కి ట్రైలర్ ద్వారా అది ఈజీగా తెలుస్తోంది. కమల్ హాసన్ అయితే యాస్కిన్ గా వేరే లెవెల్ లో కనిపించారు. మరి ఇప్పుడు మృణాల్ ఠాకూర్ రోల్ ను నాగ్ అశ్విన్ ఎలా డిజైన్ చేశారో? ఆమె ఎలా మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే.