Begin typing your search above and press return to search.

'కల్కి' తో మృణాల్‌ కి వచ్చింది ఎంత...?

దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కల్కి సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  Tupaki Desk   |   28 Jun 2024 9:11 AM GMT
కల్కి తో మృణాల్‌ కి వచ్చింది ఎంత...?
X

దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కల్కి సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్ టాక్ దక్కించుకున్న ఈ సినిమా మొదటి రోజు వసూళ్ల విషయంలో రికార్డులు నమోదు చేసినట్లుగా బాక్సాఫీస్‌ వర్గాల వారితో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు.

ఊహించిన విధంగా భారీ వసూళ్లు నమోదు చేసిన ఈ సినిమా రాబోయే రెండు మూడు వారాల వరకు బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం. ఈ సినిమాలో గెస్ట్‌ రోల్స్ లో కనిపించిన విజయ్ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌, వర్మ ఇతరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

గెస్ట్‌ రోల్స్ లో నటించిన వారిలో చాలా మంది వరకు పారితోషికం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేశారని సమాచారం అందుతోంది. కల్కి వంటి పెద్ద ప్రాజెక్ట్‌ లో భాగం అయ్యాం అనే పేరు కోసం చాలా మంది ఇందులో పారితోషికం తీసుకోకుండానే కనిపించేందుకు ఒప్పుకున్నారు అనేది టాక్‌.

చిన్న పాత్ర లో కనిపించిన మృణాల్‌ ఠాకూర్ కూడా ఈ సినిమా కోసం పారితోషికం తీసుకోలేదట. వైజయంతి మూవీస్ బ్యానర్‌ తో మృణాల్‌ ఠాకూర్ కి అనుబంధం ఉంది. టాలీవుడ్‌ లో ఈస్థాయి లో ఆఫర్లు రావడంకు ఆమె నటించిన మొదటి సినిమా సీతారామం కారణం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దుల్కర్‌ సల్మాన్‌ తో సీతారామం సినిమాను వైజయంతి మూవీస్ వారు నిర్మించారు. అందుకే తనకు కెరీర్‌ ను ఇచ్చిన వైజయంతి వారి నుంచి కల్కి సినిమా కోసం నటించి పారితోషికం తీసుకోలేదట. ప్రస్తుతం ఆమెకు వస్తున్న పారితోషికం భారీగా ఉంది. కనుక కల్కి కోసం ఆమె చిన్న పారితోషికం వద్దని ఉంటుంది. మృణాల్‌ మంచి మనసు నిజంగా అభినందనీయం అంటూ సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు.