'ఫ్యామిలీ స్టార్' లో సీతమ్మ డాన్సులు చింపేస్తుందా!
అయితే మృణాల్ కి మనసులో ఉన్నకోరికలు కొన్ని ఇంకా తీరలేదు. అమ్మడు రొమాంటిక్ పాత్రల్లో నటించాలని ఎప్పటి నుంచో కోరుకుంటుంది. కానీ ఆ ఛాన్స్ రావడం లేదు.
By: Tupaki Desk | 1 Feb 2024 12:30 AM GMTముంబై బ్యూటీ మృణాల్ టాలీవుడ్ లో జర్నీ ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. మూడు పువ్వులు..ఆరు కాయలుగా ఎంతో సంతోషంగా సాగిపోతుంది. కేవలం ప్రతిభతోనే అవకాశాలందుకుని ముందుకెళ్తుంది. ఇటీవలే 'హాయ్ నాన్న'తో మరో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. నటి పరంగా మృణాల్ నటనకు పేరు పెట్టాల్సిన పనిలేదు. ఆమె గ్రేట్ పెర్పార్మర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే మృణాల్ కి మనసులో ఉన్నకోరికలు కొన్ని ఇంకా తీరలేదు. అమ్మడు రొమాంటిక్ పాత్రల్లో నటించాలని ఎప్పటి నుంచో కోరుకుంటుంది. కానీ ఆ ఛాన్స్ రావడం లేదు. అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తుంది. ఈ విషయాన్ని ఎంతో ఓపెన్ గాను షేర్ చేసింది. మరి ఇలాంటి కోరికలు మృణాల్ మనసులో ఇంకేమైనా ఉన్నాయా? అంటే ఉన్నాయనే అంటోంది.
హీరోలతో కలిసి డాన్సులు ఇరగదీయడంలోనూ మందుండాలి అంటోంది. నేను సీరియస్ స్టోరీల్లో ఎక్కువగా నటించా. దాంతో ఊపేసే డాన్సులు చేసే అవకాశం ఎక్కడా రాలేదు. హృతిక్ రోషన్ తో కలిసి నటించిన సూపర్ 30 లోనూ ఆఛాన్స్ రాలేదు. అందుకు ఎంతో బాధపడ్డా. జెర్సీ విషయంలోనూ అదే జరిగింది. షాహిద్ కపూర్ తో కలిసి డాన్సు చేసే అవకాశం రాలేదు. అందుకే ఆయనతో కలిసి ఓ ఎంటర్ టైన్ మెంట్ సినిమా చేయాలనుకుంటున్నా.
ఇలా నా సహ నటులంతా మంచి డాన్సర్లు అయినా నేను డాన్సు చేసే అవకాశం రావడం లేదు. అందుకే అలాంటి కోరకలు అన్నింటిని సోషల్ మీడియా ద్వారా తీర్చుకుంటున్నా. అయితే ఫ్యామిలీ స్టార్ ఆలోటును తీర్చేస్తుంది' అని అంది. అటే విజయ్ దేవరకొండ తో నటిస్తోన్న ఈ సినిమాలో మృణాల్ స్టెప్పులతనూ అలరిస్తుందని తెలుస్తుంది. అన్నట్లు మృణాల్ మంచి డాన్సర్ అన్న సంగతి తెలిసిందే. టీవీ రంగం నుంచి రావడంతోనే అమ్మడు నటనతో పాటు డాన్సులోనూ ఆరితేరింది.