Begin typing your search above and press return to search.

జిమ్ లో మృణాల్.. లెగ్స్ తో గట్టిగానే..

సీతారామం లాంటి క్లాసిక్ మూవీ తర్వాత ఎమోషనల్ డ్రామా హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మృణాల్.

By:  Tupaki Desk   |   20 July 2024 12:41 PM GMT
జిమ్ లో మృణాల్.. లెగ్స్ తో గట్టిగానే..
X

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. ఫస్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సినిమాలో సీతామహాలక్ష్మీగా నటించి.. తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. తెలుగు సినీ ప్రియుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది.


సీతారామం లాంటి క్లాసిక్ మూవీ తర్వాత ఎమోషనల్ డ్రామా హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మృణాల్. నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఆ సినిమా.. సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. సరైన హిట్ అందుకోలేకపోయింది. కానీ విజయ్ దేవరకొండ సరసన యాక్ట్ చేసి ఆకట్టుకుంది. రీసెంట్ గా వచ్చిన పాన్ ఇండియా ఫిల్మ్ కల్కి2898 ఏడీలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది మృణాల్.


డీగ్లామర్‌ లుక్ లో మృణాల్‌ ఠాకూర్ ను చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సీతారామం, హాయ్‌ నాన్న, ఫ్యామిలీ స్టార్‌ సినిమాల్లో చూసిన మృణాల్‌ కు.. కల్కిలో చూసిన మృణాల్‌ కు చాలా డిఫరెన్స్ ఉందనే చెప్పాలి. యాక్టింగ్ విషయంలో మంచి మార్కులు కొట్టేసింది. చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో భాగమైనట్లు సమాచారం.


కెరీర్ విషయంలో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది మృణాల్ ఠాకూర్. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా అప్డేట్స్ కూడా షేర్ చేస్తూ ఉంటోంది. ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ.. ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్స్ తో సందడి చేస్తుంటోంది. తెలుగు సినిమాల్లో ట్రెడిషనల్ గా కనిపించినా.. నెట్టింట మాత్రం పొట్టి డ్రెస్సుల్లో ఫిదా చేస్తుంటోంది. తాజాగా స్పెషల్ ఫోటోస్ ను షేర్ చేసింది.


ఫ్రెండ్స్ తో చిల్ అయిన పిక్స్ ను షేర్ చేసింది మృణాల్ ఠాకూర్. వైట్ కలర్ టీ షర్ట్ లో క్యూట్ గా కనిపిస్తోంది. జిమ్ లో వర్కౌట్ చేస్తున్న పిక్ ను పోస్ట్ చేసింది. వైట్ అండ్ బ్లాక్ జిమ్ వేర్ లో ఫిదా చేసింది. గట్టిగానే కష్టపడినట్లు కనిపిస్తోంది. థైస్ షోతో అట్రాక్ట్ చేస్తున్న ముద్దుగుమ్మ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమ్మడి లేటెస్ట్ ఫోటో డంప్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.