ఫోటో స్టోరి: పెద్ద గౌను వేసుకున్న చిన్న పాపా
ఈ లుక్ చూశాక 'పెద్ద గౌను వేసుకున్న చిన్న పాప..' అంటూ యూత్ పూర్తి ఆపోజిట్ వెర్షన్ లో కామెంట్లు రువ్వుతున్నారు. ఇది కచ్ఛితంగా క్లాసీ ఫోటోషూట్ అనడంలో సందేహం లేదు.
By: Tupaki Desk | 28 Aug 2023 4:27 PM GMTచిన్న గౌను వేసుకున్న పెద్ద పాపా.. నీ చిన్న నాటి ముద్దు పేరు లాలి పాప..!
హై టెక్కు టెక్కు చూస్తే హీటు పుట్టు వెంటనే.. ఫ్లైటెక్కి నిన్ను చేరి కన్ను కొట్టు క్లింటనే....
చిన్న గౌను వేసుకున్న పెద్ద పాపా.. నీ చిన్న నాటి ముద్దు పేరు లాలి పాప..!
..గానగంధర్వుడు ఎస్.పి.బాలు ఆలపించిన ఈ పాట 'ప్రేమకు వేళాయెరా' చిత్రంలోనిది. జెడి. చ్రవర్తి- రమ్యకృష్ణ జంటపై ఈ పెప్పీ నంబర్ ని చిత్రీకరించారు. బాలు స్వర మాయాజాలంతో సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
అయితే ఈ పాటలోని మీనింగ్ ని కొంత రివర్సులో అర్థం చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తున్న మృణాల్ లుక్ దీనికి ప్రేరణ. ఈ లుక్ చూశాక 'పెద్ద గౌను వేసుకున్న చిన్న పాప..' అంటూ యూత్ పూర్తి ఆపోజిట్ వెర్షన్ లో కామెంట్లు రువ్వుతున్నారు. ఇది కచ్ఛితంగా క్లాసీ ఫోటోషూట్ అనడంలో సందేహం లేదు. మృణాల్ ఒక కోణంలో బాస్ లేడీని తలపిస్తూనే బ్లూ ఇన్నర్ లో అందాలను ఆరబోసిన తీరు యువతరాన్ని కవ్విస్తోంది. ముఖ్యంగా నీలి రంగు బ్రాలో మృణాల్ టూ హాట్ గా కనిపిస్తోందని యూత్ కామెంట్లు చేస్తున్నారు. బ్లూ ఇన్నర్ పై భారీ డఫెట్ కోట్ బ్లేజర్ నిజానికి ఆశ్చర్యపరుస్తోంది.
చిన్న పాత్రల్లో ఎందుకు?
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మృణాల్ తనకు ఎదురైన ఓ చిక్కు ప్రశ్న గురించి నొక్కి ఒక్కాణించింది. నువ్వు పెద్ద హీరోయిన్ వి కదా..చిన్న పాత్రలు ఎందుకు చేస్తావని నిర్మాతలు అడుగుతున్నారు! అని అంది. నిజానికి తాను కథకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఆ తర్వాత పాత్ర గురించి ఆలోచిస్తుంది. కానీ నటీనటులను ఇతరులతో పోలుస్తూ ప్రాజెక్ట్‌లో వారు పొందే స్క్రీన్ సమయాన్ని ప్రశ్నించడం ప్రతి ఒక్కరి అలవాటు. ప్రాజెక్ట్ ముఖమైనా కాదా? అనేది ఇతరులకు అనవసరం. అయితే మృణాల్ ఠాకూర్‌కు సవాళ్లతో కూడుకున్న కథలు కావాలి. ఆ తర్వాతే ఇంకేదైనా. ఇంతకుముందు ఘోస్ట్ స్టోరీస్ (2020) .. లస్ట్ స్టోరీస్ 2లో మృణాల్ నటించింది. ఇటీవల విడుదలైన మేడ్ ఇన్ హెవెన్ 2 ఒక ఎపిసోడ్‌లో కనిపించింది. ఇవన్నీ వైవిధ్యమైన కథలతో వచ్చినవే.
కొన్నిసార్లు నిర్మాతలు నన్ను ఇలా ప్రశ్నిస్తారు. 'నువ్వు హీరోయిన్ వి.. వేరొకరి చిత్రంలో అతిథి పాత్రలో నటించడం .. చిన్న పాత్రలో కనిపించడం ఎందుకు? అని అడుగుతారు. ఇలాంటివి నేను ఆలోచించి చేయలేదని కూడా మృణాల్ తెలిపింది. తన పాత్ర నిడివి కంటే కథ నచ్చాలి అని కూడా తెలిపింది. ఎవరైనా నటికి అతి పెద్ద సవాలు ఏమిటంటే.. మనకు అందివచ్చిన చిన్న పాత్రలో చేయగలిగినంత తక్కువ సమయంలో అత్యుత్తమ నటనను అందించడం! అని చెప్పింది. ఈ విషయంలో దివంగత నటుడు ఇర్ఫాన్ నుండి ప్రేరణ పొందానని కూడా తెలిపింది.
బాట్లా హౌస్ (2019), టూఫాన్ (2021), జెర్సీ (2022), గుమ్రా వంటి చిత్రాలలో నటించిన మృణాల్ సీతారామం చిత్రంతో టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అందుకుంది. వెబ్ ఆంథాలజీలో చిన్న కథలలో భాగం కావడం అంటే ఆ కథల్లో అంత విషయం ఉందని నమ్మాను గనుకే అని అంటోంది. టీవీ కోసం పెద్ద తెర కోసం అనే పట్టింపులేవీ లేవు. ఫార్మాట్ పట్టింపు లేదు. అది షార్ట్ ఫిల్మ్, ఫీచర్ ఫిల్మ్, ఎపిసోడ్ లేదా మొత్తం సిరీస్ ఏదైనా నటిస్తాను అని తెలిపింది. ప్రయోగాలను తాను ఇష్టపడతానని కూడా అంది.