Begin typing your search above and press return to search.

మృణాల్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?

యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైన్ చేస్తే ఇక ఆమెకు ప్రేక్షకులు ఆమెకు తమ హృదయాలను రాసిచ్చేస్తారు.

By:  Tupaki Desk   |   16 March 2024 9:53 AM GMT
మృణాల్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?
X

బాలీవుడ్ లో ఒక మోస్తారు ఇమేజ్ ఉన్న మృణాల్ ఠాకూర్ తెలుగులో స్టార్ హీరోయిన్ క్రేజ్ ఏర్పడింది. హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మి నూర్జహాన్ పాత్రల్లో మృణాల్ ఠాకూర్ తన అభినయంతో మెప్పించింది. ఆ సినిమా చూసిన ప్రేక్షకులంతా మృణాల్ మాయలో పడిపోయారు. తెలుగులో ఒక సినిమా సూపర్ హిట్ అయితే ఆ హీరోయిన్ కు స్టార్ రేంజ్ వచ్చేస్తుంది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైన్ చేస్తే ఇక ఆమెకు ప్రేక్షకులు ఆమెకు తమ హృదయాలను రాసిచ్చేస్తారు.


సీతారామం సినిమా మృణాల్ కి అలాంటి పాపులారిటీ తెచ్చింది. ఆ సినిమా తర్వాత న్యాచురల్ స్టార్ నానితో హాయ్ నాన్న సినిమా చేసింది అమ్మడు. ఆ సినిమాలో కూడా మృణాల్ తన మార్క్ నటనతో మెప్పించింది. మృణాల్ మ్యాజిక్ హాయ్ నాన్న సినిమాకు కూడా వర్క్ అవుట్ అయ్యింది. ఇక ఇప్పుడు అమ్మడు విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది. పరశురామ్ డైరెక్షన్ లో వస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ ఠాకూర్ మరోసారి తన యాక్టింగ్ తో మెప్పించాలని చూస్తుంది.

ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రచార చిత్రాలన్నీ కూడా విజయ్ దేవరకొండనే హైలెట్ చేస్తూ వచ్చాయి. రీసెంట్ గా వచ్చిన టీజర్ లో కూడా ఆమెది చిన్న డైలాగ్ మాత్రమే ఉంది. ఫ్యామిలీ స్టార్ సినిమాకు కూడా మృణాల్ హిట్ సెంటిమెంట్ కలిసి వస్తుందా.. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన అమ్మడు హ్యాట్రిక్ హిట్ అందుకుంటుందా అన్నది చూడాలి.

బాలీవుడ్ లో తనకు అన్నీ గ్లామర్ రోల్స్ మాత్రమే ఇస్తున్నారు. అక్కడ కూడా లవ్ స్టోరీస్ చేయాలని అనుకుంటున్నా అని ఈమధ్య ఇంటర్వ్యూలో చెప్పిన మృణాల్ తెలుగులో మాత్రం ఆమెకు యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలు ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ కూడా హిట్ పడింది అంటే మాత్రం మృణాల్ హిట్ సెంటిమెంట్ కోసం దర్శక నిర్మాతలు వెంటపడతారని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండతో గీతా గోవిందం సినిమా చేసిన పరశురాం ఫ్యామిలీ స్టార్ తో కూడా అదే రిజల్ట్ రిపీట్ చేస్తారా లేదా అన్నది చూడాలి. ఏప్రిల్ 5న రిలీజ్ లాక్ చేసిన ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ కూడా భారీగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.