Begin typing your search above and press return to search.

మృణాల్ ఖాతాలో మరో గోల్డెన్ ఛాన్స్..!

సీతారామం హిందీ వెర్షన్ చూసిన తర్వాత మృణాల్ కి ఛాన్సులు వరుస కట్టాయి.

By:  Tupaki Desk   |   22 May 2024 7:26 AM GMT
మృణాల్ ఖాతాలో మరో గోల్డెన్ ఛాన్స్..!
X

తనకు బాలీవుడ్ లో సరైన అవకాశాలు రావట్లేదు. అక్కడ కేవలం తనను రొమాంటిక్ హీరోయిన్ లా మాత్రమే చూస్తున్నారు తప్ప ప్రేమ కథలు తన దగ్గరకు రావట్లేదని ఆమధ్య ఇంటర్వ్యూలో బాలీవుడ్ మేకర్స్ పై తన అసంతృప్తిని బయట పెట్టింది మృణాల్ ఠాకూర్. ఈ కామెంట్స్ బాగా వైరల్ అవ్వడంతో నిజంగానే కొందరు మేకర్స్ మృణాల్ గురించి తమ ఆలోచన మార్చుకునే ప్రయత్నాలు చేసినట్టేనని తెలుస్తుంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి నుంచి ఒక అద్భుతమైన ఆఫర్ అందుకుంది మృణాల్ ఠాకూర్.


సంజయ్ లీల భన్సాలి మంచి దర్శకుడు మాత్రమే కాదు అభిరుచి గల నిర్మాత కూడా ఆయన నిర్మాణంలో రాబోతున్న సినిమాలో మృణాల్ ఠాకూర్ కు లక్కీ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో సినిమాలు చేసినా కూడా మృణాల్ ఠాకూర్ చేసిన సీతారామం సినిమా ఆమె కెరీర్ పై బాగా ఇంపాక్ట్ చూపించింది. ఆ సినిమా తెలుగులో సూపర్ హిట్ కాగా హిందీలో కూడా మంచి సక్సెస్ అయ్యింది.

సీతారామం హిందీ వెర్షన్ చూసిన తర్వాత మృణాల్ కి ఛాన్సులు వరుస కట్టాయి. సంజయ్ లీల భన్సాలి కూడా ఆ సినిమా చూసే అమ్మడికి ఈ ఛాన్స్ ఉండొచ్చని అనుకుంటున్నారు. భన్సాలి ప్రొడ్యూసర్ గా రవి ఉద్యావర్ డైరెక్షన్ లో రాబోతున్న రొమాంటిక్ లవ్ డ్రామాతో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో మృణాల్ సిద్ధాంత్ చతుర్వేదితో జత కడుతుంది. మాం సినిమాతో తన సత్తా చాటిన రవి ఉద్యావర్ ఈ సినిమాను తనదైన స్టైల్ లో తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఈ సినిమాకు సంజయ్ లీల భన్సాలి మ్యూజిక్ కూడా అందిస్తారని టాక్. సో సంజయ్ లీల భన్సాలి ఫ్యాక్టరీ నుంచి రాబోతున్న ఈ సినిమా బాలీవుడ్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఇటు తెలుగులో కూడా మృణాల్ వరుస క్రేజీ ఆఫర్లు అందుకుంటుంది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ తో ది ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించిన మృణాల్ ఆ సినిమాతో తెలుగులో మొదటి ఫెయిల్యూర్ ఫేస్ చేసింది. అయినా కూడా అమ్మడితో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు వెంట పడుతున్నారని తెలుస్తుంది. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండిట్లో కూడా మృణాల్ తన ఫాం కొనసాగిస్తుంది.