తెలుగింట కోడలనుకుంటే ఈ ట్విస్టులేంటి సీతమ్మ!
ప్రస్తుతం మా గురించి వెలువడుతున్న వార్తలు ఏవీ నిజం కాదు' అంటూ ఓ ఫన్నీ ఎమోజీని పోస్ట్ చేశాడు. దీంతో మృణాల్- బాద్ షాల మధ్య ప్రెండ్ షిప్ ఎలాంటి లవ్ లేదని తెలుస్తుంది.
By: Tupaki Desk | 14 Nov 2023 11:30 AM GMTమృణాల్ ఠాకూర్ తెలుగింట కోడలవుతుందనే ప్రచారంపై ఓ రూమర్ కొంత కాలంగా అదే తీరున నీళ్లు జల్లేస్తుంది. అమ్మడు - బాలీవుడ్ గాయకుడు బాద్ షా ప్రేమలో ఉందని కొన్ని నెలలుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. ఇద్దరు జంటగా పలు పార్టీల్లోనూ..సన్నిహితంగా మూవ్ అవుతున్న సందర్భాలు చూసి వ్యవహరం నిజయయ్యేలా ఉందనిపించింది. రీసెంట్ గా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దీపావళి సందర్భంగా గ్రాండ్ పార్టీలోనూ ఇద్దరు కనిపించారు.
మృణాల్- బాద్‌షా ఈ సెలబ్రేషన్స్ లో ఎంతో హంగామా చేశారు. పార్టీ అయిపోయిన తర్వాత కూడా ఇద్దరు చనువుగా మెలిగారు. అక్కడితో సరిపెట్టకుండా శిల్పా శెట్టి బాద్‌షాలతో దిగిన ఫొటోలను మృణాల్ తన ఇన్‌స్టాలో సైతం షేర్ చేసింది. వాటికి ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది 'నాకు అత్యంత ఇష్టమైన వారు' అని రాసుకొచ్చింది. దీంతో మృణాల్-బాద్ షా వ్యవహరమంతా నిజమని దాదాపు కన్పమ్ చేసినట్లు అనిపించింది.
ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ని మించి సాగుతుందని మీడియా కథనాలు అంతకంతకు వెడెక్కించాయి. తాజాగా వీటిపై సింగర్ బాద్‌షా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. 'డియర్ ఇంటర్నెట్. మరోసారి నిరాశపరు స్తున్నందుకు క్షమించు. ప్రస్తుతం మా గురించి వెలువడుతున్న వార్తలు ఏవీ నిజం కాదు' అంటూ ఓ ఫన్నీ ఎమోజీని పోస్ట్ చేశాడు. దీంతో మృణాల్- బాద్ షాల మధ్య ప్రెండ్ షిప్ ఎలాంటి లవ్ లేదని తెలుస్తుంది.
మరి ఈ కథనాలపై..బాద్ షా ఖండనపై మృణాల్ ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ తెలుగు సినిమాలతో పుల్ బిజీగా ఉంది. నాని సరసన 'హాయ్ నాన్న'..విజయ్ దేవరకొండ మరో సినిమా చేస్తుంది. ఇవి రెండు గాక కొత్త అవకాశాలు బాగానే వస్తున్నాయి. అలాగే బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేస్తోంది.