వీడియో: మృణాల్ ఈ భంగిమలతో కొల్లగొట్టిందే
అందమైన మెర్మయిడ్ ఛమ్కీల దుస్తుల్లో మృణాల్ ఠాకూర్ హొయలుపోయిన తీరు మతులు చెడగొడుతోంది.
By: Tupaki Desk | 1 Feb 2024 4:26 AM GMT'క్వీన్ ఆఫ్ రొమాన్స్' అంటూ కీర్తినందుకుంది మృణాల్. అందుకు తగ్గట్టే ఇప్పుడు ఒక వీడియో అంతర్జాలంలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మృణాల్ రొమాంటిక్ యాంగిల్ గుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది. అందమైన మెర్మయిడ్ ఛమ్కీల దుస్తుల్లో మృణాల్ ఠాకూర్ హొయలుపోయిన తీరు మతులు చెడగొడుతోంది. ఈ లేటెస్ట్ ఫోటోషూట్ మృణాల్ కెరీర్ లో మరో హాటెస్ట్ ఫోటోషూట్ అనడంలో సందేహం లేదు.
నటిగా కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న అత్యుత్తమ ప్రతిభావనిగా మృణాల్ ఠాకూర్ కీర్తినందుకుంది. `సీతా రామం`తో తెలుగులో డెబ్యూ నాయికగా మెప్పించింది. ఇటీవలే హాయ్ నాన్న చిత్రంలో అద్భుత నటనతోను అందరినీ ఆకట్టుకుంది. జెర్సీ, తూఫాన్, సూపర్ 30 లాంటి సినిమాలతో హిందీ చిత్ర పరిశ్రమలోనూ తన సత్తా ఏంటో నిరూపించుకుంది. అయినా కానీ తనకు హిందీలో రొమాంటిక్ లవ్ స్టోరీలో నటించేంత పాపులారిటీ ఇంకా దక్కలేదని భావిస్తున్నట్టు తెలిపింది. తాజా ఇంటర్వ్యూలో మృణాల్ రొమాంటిక్ చిత్రాలలో నటించే అవకాశం ఇవ్వమని ఫిలింమేకర్స్ ని అడగడం మానేశానని చెప్పారు.
''నాకు ఇంకా హిందీ పరిశ్రమలో లవ్ స్టోరీలో అవకాశం వచ్చేంత పాపులారిటీ రాలేదు.. తప్పేంటి?.. లవ్ స్టోరీ రావాలంటే పాపులర్ అవ్వాలి కదా? రొమాంటిక్ సినిమాలకు ఇంకా నాకు అర్హత రాలేదు`` అంటూ నవ్వేసింది. అంతేకాదు ప్రేమకథా చిత్రాల విషయంలో హిందీ నిర్మాతలను సంప్రదించడంలో తాను విసిగిపోయానని మృణాల్ తెలిపారు. నాకు రొమాంటిక్ లవ్ స్టోరీల్లో నటించాలనుంది. కానీ నేను అలాంటి వాటిలో నిరూపించడంలో విసిగిపోయాను. ఇది సహజంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. నేను నిర్మాతలను అడగడం పూర్తిగా మానేసాను..`` అని అంది.
అయితే తెలుగు చిత్రసీమలో రొమాంటిక్ చిత్రాల్లో నిరూపించుకున్న మృణాల్ బాలీవుడ్ విషయంలో విసుగెత్తి ఇలా మాట్లాడిందని అర్థం చేసుకోవాలి. మృణాల్‌ను ఇటీవల 'క్వీన్ ఆఫ్ రొమాన్స్` అంటూ అభిమానులు కీర్తిస్తున్నారు. షారూఖ్ ఖాన్ `కింగ్ ఆఫ్ రొమాన్స్' కాబట్టి మృణాల్ తనను అలా పిలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. తెలుగు చిత్ర పరిశ్రమలో తను క్రియేట్ చేసిన మ్యాజిక్‌నే ఇతర సినీ పరిశ్రమల్లోను క్రియేట్ చేయాలని భావిస్తున్నట్టు తెలిపింది.
హాయ్ నాన్నా - సీతా రామం చిత్రాలతో తెలుగు వారు తీర్చిదిద్దినందుకు సంతోషంగా ఉన్నానని తెలిపింది. నేను ఈ మ్యాజిక్‌ను కొనసాగించాలని ఆశిస్తున్నాను.. మరో భాషలో ఇలాంటివి చేయాలని ఆశాజనకంగా ఉన్నాను. షారుఖ్ ఖాన్ రొమాన్స్ రాజు కాబట్టి నన్ను శృంగార రాణి అని పిలిచినప్పుడు నేను పొంగిపోయాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.