Begin typing your search above and press return to search.

అంధమైన మృణాల్.. స్టన్నింగ్ గ్లామర్!

ఈ బ్యూటీ సినిమాల్లోకి రాకముందే మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది.

By:  Tupaki Desk   |   14 Nov 2023 10:51 AM GMT
అంధమైన మృణాల్.. స్టన్నింగ్ గ్లామర్!
X

చూడగానే చిరునవ్వుతో ఆకట్టుకునే అందమైన హీరోయిన్స్ లలో మృణాల్ ఠాగూర్ ఒకరు. ఈ బ్యూటీ సినిమాల్లోకి రాకముందే మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఇక ఆ తర్వాత మరాఠీ చిత్ర పరిశ్రమలో మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుని నటిగా కూడా విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ఇక తర్వాత అమ్మడికి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా తొందరగానే అవకాశాలు వచ్చాయి.


అయితే అమ్మడు తొందరపడకుండా కేవలం తనకు నచ్చిన మంచి కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుని నటిగా ఒక స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన ఆఫర్లను కూడా ఉపయోగించుకుంది. సీతారామం సినిమా ఏ స్థాయిలో గుర్తింపు అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పటికే సూపర్ 30 లాంటి సక్సెస్ సొంతం చేసుకున్న అమ్మడు తర్వాత అంతకంటే చిన్న బడ్జెట్ సినిమాలలో కూడా నటించడం విశేషం.


మంచి కంటెంట్ ఉంటే చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధమే అనేలా ఆమె కెరీర్ కొనసాగుతోంది. ఇక సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫోటోలు కూడా ఫాలోవర్స్ కు కనువిందుని చేస్తాయి. తన గ్లామర్ తో ప్రతి ఫోటోలో ఎంతో అందంగా కనిపించే మృనల్ ఠాగూర్ రీసెంట్గా ఒక గౌనులో కూడా అంతే అందంగా కనిపించింది. కాస్త ఎద అందాలతో ఘాటుగా కనిపిస్తూనే మరొకవైపు తన చిరునవ్వుతో కూడా ఫాలోవర్స్ ను.మంత్రముగ్దులను చేసింది.


గ్లామర్ లో తనకు తానే పోటీ అన్నట్లుగా ఆమె ఆ ఫోటోలో దర్శనం ఇచ్చింది. ఇక నిమిషంలోనే ఆ స్టిల్ కు లక్షల్లో లైకులు వచ్చాయి. ఇక ఈ బ్యూటీ కాస్త నెమ్మదిగా సినిమాలు చేస్తున్నప్పటికీ మంచి ఫలితాలను సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం నాని హీరోగా తెరపైకి రాబోతున్న హాయ్ నాన్న అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట.


అంతే కాకుండా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ లో కూడా మెయిన్ హీరోయిన్ గా కనిపించబోతోంది. పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఆ సినిమా సంక్రాంతికి రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే మృనల్ ఠాగూర్ రేంజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ లోకి వెళ్లినట్లే అని చెప్పవచ్చు.