Begin typing your search above and press return to search.

అన్నంత పని చేసిన మృణాల్‌ ఠాకూర్‌

బుల్లి తెర ద్వారా నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న మృణాల్ ఠాకూర్ బాలీవుడ్‌ లో పలు సినిమాల్లో నటించింది.

By:  Tupaki Desk   |   13 Aug 2024 10:31 AM GMT
అన్నంత పని చేసిన మృణాల్‌ ఠాకూర్‌
X

బుల్లి తెర ద్వారా నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న మృణాల్ ఠాకూర్ బాలీవుడ్‌ లో పలు సినిమాల్లో నటించింది. అయితే బాలీవుడ్‌ లో ఈమెకు భారీ విజయాలు దక్కలేదు. టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా సీతారామం తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు లో ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌ గా నిలిచి వరుస సినిమాలు చేస్తున్న మృణాల్‌ ఠాకూర్‌ ఇతర హీరోయిన్స్ కి చాలా విభిన్నం అంటూ పలు సందర్భాల్లో నిరూపితం అయ్యింది. మరోసారి మృణాల్‌ ఠాకూర్ చేసిన పనితో అందరి దృష్టిని ఆకర్షించడం మాత్రమే కాకుండా నిజంగా మృణాల్‌ గ్రేట్‌ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... కొన్నాళ్ల క్రితం మృణాల్‌ ఠాకూర్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు వ్యవసాయం అంటే ఇష్టం, నేను భవిష్యత్తు రైతును అన్నట్లుగా చెప్పుకొచ్చింది. వ్యవసాయం చేయాలనే కోరిక నాలో ఉందని పేర్కొంది. చాలా మంది ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. కానీ ఆ దిశగా అడుగులు వేయడం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. మృణాల్‌ తాను అనుకున్నట్లుగా వ్యవసాయం చేసేందుకు ముందడుగు వేసింది. వ్యవసాయంలో మెళకువలు నేర్చుకునే పనిలో పడింది. ఆ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా మృణాల్‌ తెలియజేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

తాజాగా సోషల్‌ మీడియాలో మృణాల్‌ షేర్‌ చేసిన వీడియో లో వ్యవసాయం కు సంబంధించిన విషయాలను పంచుకుంది. భవిష్యత్తు రైతు అనిపించుకుంటూ మృణాల్‌ వ్యవసాయ క్షేత్రం లో తిరుగుతూ, అక్కడ కొన్ని పనులు చక్కబెడుతూ కనిపించింది. పనులు నేర్చుకోవాలనే కోరిక ఉండటం సహజం. అయితే అందుకోసం చేసే ప్రయత్నాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ మృణాల్‌ మాత్రం తాను అనుకున్నట్లుగానే వ్యవసాయం నేర్చుకోవడంతో పాటు, ఇంకా ఇతర పనులపై కూడా ఆసక్తి చూపిస్తుంది. మట్టి కుండలు చేసే చట్రం వద్ద కూడా మట్టి పాత్రలు చేస్తూ మృణాల్‌ సోషల్‌ మీడియా లో షేర్ చేసిన వీడియోలో కనిపించింది.

మొత్తానికి మృణాల్ ఠాకూర్ అనుకున్నట్లుగానే రైతుగా మారేందుకు వ్యవసాయం నేర్చుకునేందుకు రెడీ అయ్యింది. ఆమె ప్రస్తుతం హీరోయిన్‌ గా చాలా బిజీగా ఉంది. అయినా కూడా దొరికిన కొద్ది పాటి సమయం ను ఇలా వ్యవసాయ పనులు నేర్చుకునేందుకు వినియోగించడం, ప్రకృతితో మమేకం అయ్యి చిల్ అయ్యేందుకు ప్రయత్నించడం మంచి పరిణామం అంటూ ఆమె ఫ్యాన్స్ తో పాటు, సోషల్‌ మీడియాలో నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే హిందీలో రెండు సినిమాలకు సైన్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

తెలుగు లో కూడా రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. కల్కి సినిమాలో చిన్న గెస్ట్‌ రోల్‌ లో కనిపించిన మృణాల్‌ ఠాకూర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ముందు ముందు ఈ అమ్మడు మరిన్ని సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించడం ఖాయం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రెగ్యులర్‌ గా అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచే మృణాల్‌ ఠాకూర్‌ ఈసారి వ్యవసాయానికి సంబంధించిన వీడియోను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.