ఆచి తూచి అంటే అర్దం ఆమెనా?
ఆ సినిమా సక్సెసె అమ్మడికి మరోసారి మంచి గుర్తింపును తీసుకొచ్చింది
By: Tupaki Desk | 2 Jan 2024 11:30 PM GMT'సీతారామం' తర్వాత సెకెండ్ ఛాన్స్ తీసుకోవడానికి మృణాల్ ఠాకూర్ ఎంత కాలం వెయిట్ చేసిందో తెలిసిందే. అవకాశాలు రాక చేయలేదా? అవకాశం వచ్చినా పాత్రలు నచ్చక అంగీకరించలేదా? అన్నది తర్వాత సంగతి! కానీ ఏడాడి గ్యాప్ తర్వాత హాయ్ నాన్నలో మరోసారి పర్పెక్ట్ రోల్ చూజ్ చేసుకుని నటిగా తన సత్తా చాటింది. నటనకు ఆస్కారం ఉన్న రోల్ అంటే ఇదీ అనిపించి మరోసారి ప్రూవ్ చేసింది.
ఆ సినిమా సక్సెసె అమ్మడికి మరోసారి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఇదే వరుసలో 'ఫ్యామిలీ స్టార్' కూడా చేస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. ఆ చిత్రాన్ని పరుశురాం తెరకెక్కిస్తు న్నాడు. కాబట్టి హీరోయిన పాత్ర ఎలా ఉంటుందని? చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాల్లో సహజంగానే హీరో పాత్రకి ధీటుగా హీరోయిన్ రోల్ డిజైన్ చేసి ఉటుంది. మృణాల్ లాంటి పెర్పార్మర్ దొరికితే పరశురాం ఆ పాత్రని ఇంకా బలంగా మార్చగలడు.
కాబట్టి ఫ్యామిలీ స్టార్ లో మృణాల్ పాత్ర ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. తాజాగా కోలీవుడ్ లోనూ లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ మేకర్ రవికుమార్ తదుపరి చిత్రం రాఘవ లారెన్స్ తో చేస్తున్నాడు. అందులో హీరోయిన్ గా మృణాల్ ఎంపికైంది. అలాగే లారెన్స్ హీరోగానే రమేష్ వర్మ మరో సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇందులోనే ఈ భామనే ఎంపిక చేసినట్లు సమాచారం.
ఇందులో మృణాల్ పాత్రలు ఎంతో బలంగా ఉంటాయని తెలుస్తోంది. వాటి స్టోరీ నేరేషన్ కూడా దర్శకుడు ఒకసారి ఇస్తే ఒప్పుకోలేదుట. రెండుస్లార్లు నేరేషన్ ఇప్పించుకుందిట. తన పాత్రకి సంబంధించి ఒకసారి మాత్రమే విందట. సినిమా స్టోరీ మాత్రం రెండు సార్లు చెప్పించుకుందిట. అదీ మీణాల్ లెక్క. అలా లేకపోతే ఆమె ఒప్పుకోవడానికి ఏమాత్రం ఛాన్స్ ఉండదు. దీన్ని బట్టి మృణాల్ అచితూచి అడుగులు వేయడానికి అసలైన అర్దంలా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఆ పదానికి పర్యాయ పదంలా మృణాల్ నిలుస్తుందని తెలుస్తుంది.