Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : చూపు తిప్పుకోనివ్వని అందాల మృణాల్‌

హిందీ ప్రేక్షకులకు బుల్లితెర మరియు వెండి తెర ద్వారా సుదీర్ఘ కాలంగా సుపరిచితురాలు అయిన మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   23 Dec 2023 6:45 AM GMT
పిక్ టాక్ : చూపు తిప్పుకోనివ్వని అందాల మృణాల్‌
X

హిందీ ప్రేక్షకులకు బుల్లితెర మరియు వెండి తెర ద్వారా సుదీర్ఘ కాలంగా సుపరిచితురాలు అయిన మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. నార్త్‌ లో ఎప్పటి నుంచో చేస్తున్నా కూడా దక్కని గుర్తింపు మరియు గౌరవం కేవలం సీతారామం సినిమాతో మృణాల్ దక్కించుకుంది.


తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్ ను దక్కించుకుంది. తాజాగా హాయ్‌ నాన్న సినిమా తో వచ్చి మరో విజయాన్ని మృణాల్ తన ఖాతాలో వేసుకుంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అవ్వడంతో చీర కట్టులో అయినా మోడ్రన్ డ్రెస్ లో అయినా మృణాల్‌ చూపు తిప్పుకోలేనంత అందంగా కనిపిస్తుంది.


తాజాగా మరోసారి ఒక ట్రావెల్‌ సంస్థకి ప్రమోషన్‌ కోసం ఫోటో షూట్‌ లో మృణాల్ మెరిసింది. తాజా ఫోటో షూట్‌ లో మరింత అందంగా ఆకర్షణీయంగా ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్ కనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న మృణాల్‌ ఠాకూర్ సినిమాల్లో ఆ స్థాయి అందాల ప్రదర్శన కు ఛాన్స్ రాలేదు అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.


బ్యాక్ టు బ్యాక్ టాలీవుడ్‌ లో విజయాలను సొంతం చేసుకున్న మృణాల్‌ హ్యాట్రిక్ కోసం విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. అన్ని వర్గాల వారిని మెప్పిస్తూ టాలీవుడ్‌ లో బలమైన ముద్ర వేస్తున్న మృణాల్ ఠాకూర్ ముందు ముందు మరిన్ని పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి.