Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : నువ్వు నాకు దేవుడిచ్చిన వరం

నాని హీరోగా రూపొంది విడుదలకు రెడీగా ఉన్న 'హాయ్‌ నాన్న' సినిమాలో హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్ నటించిన విషయం తెల్సిందే. సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో కియారా ఖన్నా కనిపించబోతుంది.

By:  Tupaki Desk   |   20 Nov 2023 5:56 AM GMT
పిక్ టాక్ : నువ్వు నాకు దేవుడిచ్చిన వరం
X

నాని హీరోగా రూపొంది విడుదలకు రెడీగా ఉన్న 'హాయ్‌ నాన్న' సినిమాలో హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్ నటించిన విషయం తెల్సిందే. సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో కియారా ఖన్నా కనిపించబోతుంది. నాని కూతురు పాత్రలో కియారా కనబర్చే తీరు, మరియు పాప చెప్పే డైలాగ్స్ అన్ని కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని అంటున్నారు.


నేడు పాప కియారా ఖన్నా పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ శుభాకాంక్షలు చెబుతూ ఎమోషనల్‌ పోస్ట్‌ ను షేర్ చేసింది. షూటింగ్‌ సందర్భంగా ఎంతో మంది పరిచయం అవుతూ ఉంటారు. అయితే మృణాల్‌ కు మరీ ఇంతగా కియారా ఖన్నా నచ్చిందా అని ఆమె పెట్టిన ఫోటోలు మరియు పోస్ట్ ను చూస్తే అనిపిస్తోంది


ఈ ఫోటోను పోస్ట్‌ చేసిన మృణాల్‌ ఠాకూర్‌ ఇన్ స్టా ద్వారా... హాయ్ నాన్న సెట్స్ లో నా లిటిల్ ప్రిన్సెస్‌. మై సన్ షైన్‌.. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. షూటింగ్ గ్యాప్ లో నీతో ఆటలు ఆడటం, నీకు డాన్స్ నేర్పించడం, కొత్త పదాలు పలకడం వంటివి నేను ఆస్వాదించాను. నువ్వు నాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం. దేవుడు ఇచ్చిన బిడ్డగా నేను భావిస్తున్నాను.


నీ విధేయత మరియు నీవు భావాలను వ్యక్తీకరించే విధానం నాకు నచ్చింది. నేను తదుపరి నటించే ప్రతి సినిమా లో కూడా నువ్వు ఉండాలని కోరుకుంటాను. అందుకు గాను ఒక ఒప్పందం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను.


నువ్వు లేకుండా మా సినిమా ఇంత అద్భుతంగా వచ్చేది కాదు అంటూ కియారా ఖన్నా పై ప్రశంసల వర్షం కురిపిస్తూ మృణాల్ తన పోస్ట్‌ తో హ్యాపీ బర్త్‌ డే చెప్పింది. ప్రస్తుతం ఈ ఫోటోలు మరియు మృణాల్ కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.