Begin typing your search above and press return to search.

మృణాల్ అప్పుడే ఖాళీ అయిపోయిందా..?

సీతారామం తర్వాత తెలుగులో హాయ్ నాన్న చేయగా అది కూడా సక్సెస్ అయ్యింది.

By:  Tupaki Desk   |   16 Jun 2024 5:30 PM GMT
మృణాల్ అప్పుడే ఖాళీ అయిపోయిందా..?
X

ప్రస్తుతం హీరోయిన్స్ అంతా కూడా సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అక్కడ ఇక్కడ అదరగొట్టేస్తున్నారు. ముఖ్యంగా సౌత్ లో స్టార్ క్రేజ్ వచ్చిన హీరోయిన్స్ కు బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి. ఐతే సీతారామం తో తెలుగు తెరంగేట్రం చేసిన మృణాల్ ఠాకూర్ కి ఇక్కడ అక్కడ రెండు చోట్ల మంచి క్రేజ్ వచ్చింది. సీతారామం వల్ల తెలుగులో పాపులారిటీ సంపాదించిన అమ్మడు హిందీలో కూడా మంచి క్రేజ్ ఏర్పరచుకుంది. సీతారామం తర్వాత తెలుగులో హాయ్ నాన్న చేయగా అది కూడా సక్సెస్ అయ్యింది. ఇదే ఊపులో విజయ్ దేవరకొండతో ది ఫ్యామిలీ స్టార్ లో నటించింది మృణాల్ ఠాకూర్.

ఆ సినిమా ఆడియన్స్ ని రీచ్ అవ్వడంలో ఫెయిల్ అయ్యింది. రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన తర్వాత థర్డ్ సినిమా కూడా సూపర్ హిట్ కొడుతుందని అనుకోగా అది కాస్త నిరాశ పరిచింది. రెండు హిట్ పడే టైం లో టాలీవుడ్ అంతా మృణాల్ పేరు జపం చేయగా ఒక్క ఫ్లాప్ వచ్చిందో లేక అమ్మడిని లైట్ తీసుకున్నారు. నిన్న మొన్నటిదాకా డిస్కషన్ లో అయినా మృణాల్ పేరు వినిపించేది ఇప్పుడు అది కూడా జరగట్లేదు.

తెలుగులో దాదాపు మృణాల్ ఖాళీ అయినట్టే అని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం అమ్మడి చేతిలో హిందీలో ఒక ప్రాజెక్ట్ ఉంది. పూజా మేరీ జాన్ సినిమా చేస్తున్న మృణాల్ ఆ సినిమాతో అక్కడ సక్సెస్ అందుకోవాలని చూస్తుంది. హిందీలో తనకు లవ్ స్టోరీస్ రావట్లేదని బాధపడుతున్న మృణాల్ ఠాకూర్ కి ఇక మీదట అలాంటి అవకాశాలు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట.

తెలుగులో ఎలాగు ఆఫర్లు లేవని మృణాల్ ఠాకూర్ కోలీవుడ్ వైపు చూస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే తమిళ్ నుంచి ఒక ప్రాజెక్ట్ చర్చల దశల్లో ఉన్నట్టు టాక్. అది ఓకే అయితే మాత్రం మృణాల్ కోలీవుడ్ షిఫ్ట్ అవుతుంది. తెలుగులో క్లిక్ అయిన హీరోయిన్స్ తమిళ్ లో.. అక్కడ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ తెలుగులో ఛాన్సులు అందుకోవడం కామనే. మరి మృణాల్ ఠాకూర్ కోలీవుడ్ లో అయినా కాన్ స్టంట్ హిట్లు కొడుతుందేమో చూడాలి. ఐతే సినిమాలు ఎలా ఉన్నా మృణాల్ సోషల్ మీడియాలో సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అందరిని అలరిస్తుంది. అమ్మడికి సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా రోజు రోజుకి భారీగానే పెరుగుతున్నారు.