Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్ ఎఫెక్ట్‌.. దెయ్యం తో దోస్తీ!

బాలీవుడ్‌ లో సుదీర్ఘ కాలంగా సినిమాలు చేస్తూ, బుల్లి తెరపై సందడి చేస్తున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్

By:  Tupaki Desk   |   9 Jun 2024 3:00 AM GMT
ఫ్యామిలీ స్టార్ ఎఫెక్ట్‌.. దెయ్యం తో దోస్తీ!
X

బాలీవుడ్‌ లో సుదీర్ఘ కాలంగా సినిమాలు చేస్తూ, బుల్లి తెరపై సందడి చేస్తున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఇంత కాలంగా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయిన మృణాల్‌ ఠాకూర్ కి తెలుగు లో చేసిన సీతారామం సినిమా మంచి విజయాన్ని తెచ్చి పెట్టింది.

ఆ వెంటనే చేసిన హాయ్ నాన్న సినిమా కూడా విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా మృణాల్‌ ఠాకూర్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. రెండు బ్యాక్ టు బ్యాక్ విజయాలతో మృణాల్‌ టాలీవుడ్‌ లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ అన్నట్లుగా పేరు పడింది. అంతే కాకుండా పారితోషికం కూడా భారీగా పెంచింది.

టాప్‌ గేర్ లో దూసుకు పోతున్న ముద్దుగుమ్మ మృణాల్‌ కి సడెన్ బ్రేక్ అన్నట్లుగా ఫ్యామిలీ స్టార్‌ దెబ్బ తీసింది. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుని ఉంటే టాలీవుడ్‌ లోనే మరో నాలుగు అయిదు సినిమాలకు మృణాల్‌ కమిట్‌ అయ్యి ఉండేది.

టాలీవుడ్‌ లో ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడంతో కోలీవుడ్‌ వైపు ఈ అమ్మడు చూస్తుంది. తాజాగా ఈ అమ్మడిని రాఘవ లారెన్స్‌ సంప్రదించాడనే వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఆయన కాంచన 4 సినిమా ను ప్రకటించాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా మృణాల్‌ ను ఎంపిక చేశారనే టాక్‌ వినిపిస్తుంది.

పారితోషికం గత సినిమాలతో పోల్చితే కాస్త తగ్గిందని కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఫ్యామిలీ స్టార్‌ ఎఫెక్ట్‌ మృణాల్‌ కెరీర్ కి బాగానే దెబ్బ తీసిందా అంటే ఔను అనే సమాధానం వినిపిస్తుంది. ఫ్యామిలీ స్టార్‌ మూవీ హిట్‌ అయ్యి ఉంటే ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి కాంబో లో మృణాల్‌ ను తీసుకునే అవకాశం ఉండేదని టాక్‌.