Begin typing your search above and press return to search.

ట్యాలెంటెడ్ బ్యూటీ బాస్ లేడీ వైబ్స్

బ్లేజ‌ర్ త‌ర‌హాలో వైట్ టాప్.. వైట్ ఇన్న‌ర్.. దానికి జ‌త‌గా వైట్ క‌ల‌ర్ బాట‌మ్ ప‌ర్ఫెక్ట్ బాస్ లేడీ వైబ్స్ ని తెచ్చాయ‌ని చెప్పాలి.

By:  Tupaki Desk   |   12 May 2024 6:22 AM GMT
ట్యాలెంటెడ్ బ్యూటీ బాస్ లేడీ వైబ్స్
X

అందానికి అందం.. న‌ట ప్ర‌తిభ పుష్క‌లంగా ఉన్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. త‌న హైట్ మ‌రో ప్ర‌త్యేక‌ ఆక‌ర్ష‌ణ‌. ఈ బ్యూటీ డీసెంట్ లుక్స్ ఇప్ప‌టికే ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయ్యాయి. ప్ర‌తిసారీ వైవిధ్య‌మైన లుక్ లో క‌నిపించే ఈ బ్యూటీలో బాస్ లేడీ వైబ్స్ బ‌య‌ట‌పడ్డాయ్ అంటూ అభిమానులు కితాబిచ్చేస్తుంటారు. ఇప్పుడు మ‌రోసారి అలాంటి బాస్ లేడీ లుక్స్ తో ప్ర‌త్య‌క్ష‌మైంది మృణాల్. ఈ లుక్ నిజంగానే మేజర్ గోల్స్ ని సెట్ చేసిందంటే అతిశ‌యోక్తి కాదు. అద్భుతమైన తెల్లటి పవర్ సూట్‌లో ఆకట్టుకునే రూపంతో అంద‌మైన స్మైల్ తో మృణాల్ ఆక‌ర్షించింది. బ్లేజ‌ర్ త‌ర‌హాలో వైట్ టాప్.. వైట్ ఇన్న‌ర్.. దానికి జ‌త‌గా వైట్ క‌ల‌ర్ బాట‌మ్ ప‌ర్ఫెక్ట్ బాస్ లేడీ వైబ్స్ ని తెచ్చాయ‌ని చెప్పాలి.

విజయ్ దేవరకొండతో 'ఫ్యామిలీ స్టార్'లో అద్భుత న‌ట‌న లుక్స్ తో అభిమానుల హృదయాలను కొల్లగొట్టినట్లే, మృణాల్ విసిరిన లేడీ బాస్ ఛాలెంజ్ ని ఇత‌రులు అనుస‌రిస్తారేమో చూడాలి. నిజానికి ఈ వైట్ అండ్ వైట్ లుక్ లో స్టైలిష్ ఎలివేష‌న్ తో హీట్‌ని పెంచింది. ముఖ్యంగా వైట్ బ్లేజర్‌తో బాసిజం చూపిస్తూ అలా వేదిక‌పై క‌నిపించిన మృణాల్ పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

'కుంకుమ్ భాగ్య' అనే టీవీ షోతో మృణాల్ పాపులారిటీ సంపాదించుకుని అనంత‌రం వెండితెర‌పై ప్ర‌వేశించింది. లవ్ సోనియా, సూపర్ 30, ధమాకా, జెర్సీ, సీతా రామం స‌హా వ‌రుస‌ చిత్రాలతో న‌టిగా నిరూపించుకుంది. విజయ్ దేవరకొండతో కలిసి ది ఫ్యామిలీ స్టార్‌లో కనిపించిన మృణాల్ ఠాకూర్ 2024లో మరో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 'పూజా మేరీ జాన్' అనే హిందీ చిత్రంలో మృణాల్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి హిందీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రిన్ని స్క్రిప్టులు వింటోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.