Begin typing your search above and press return to search.

అందాల మృణాల్‌ కన్నుల విందు

ముంబైలోని బాంద్ర లో మృణాల్‌ ఠాకూర్ కనిపించింది. జీన్స్ షర్ట్‌ ధరించిన మృణాల్‌ కన్నుల విందు చేసింది.

By:  Tupaki Desk   |   7 July 2024 9:58 AM GMT
అందాల మృణాల్‌ కన్నుల విందు
X

హిందీ బుల్లితెర మరియు వెండి తెర ప్రేక్షకులను సుదీర్ఘ కాలంగా అలరిస్తూ వస్తున్న ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్ తెలుగు లో సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. చాలా కాలంగా హిందీలో చేస్తున్న సినిమాలు, సీరియల్స్ ద్వారా రాని గుర్తింపు కేవలం సీతారామం సినిమాతో వచ్చింది అనడంలో సందేహం లేదు.

హీరోయిన్ గా ప్రస్తుతం టాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్ మృణాల్‌. భారీ పారితోషికం తీసుకుంటూ, వరుస సినిమాలు చేస్తున్న మృణాల్‌ ఠాకూర్ రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో సందడి చేస్తూనే ఉంటుంది. మరోసారి తన అందాల ఆరబోత వీడియో తో వైరల్‌ అయ్యింది.

ముంబైలోని బాంద్ర లో మృణాల్‌ ఠాకూర్ కనిపించింది. జీన్స్ షర్ట్‌ ధరించిన మృణాల్‌ కన్నుల విందు చేసింది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ మధ్య కాలంలో మృణాల్‌ బరువు తగ్గినట్లు ఉంది అంటూ ఈ వీడియోను చూసిన చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

మృణాల్‌ ఠాకూర్ తాజా ఈ వీడియో ను నెటిజన్స్ తెగ చూస్తూ వైరల్‌ చేస్తున్నారు. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ ఈ వీడియోను చూసిన నెటిజన్స్ మరియు ఆమె ఫాలోవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం చేతిలో పలు సినిమాలు ఉన్న మృణాల్‌ ఠాకూర్ బిజీ బిజీగా ఉన్నా కూడా వర్కౌట్స్ కి కావాల్సినంత సమయం కేటాయిస్తూనే ఉందట. అందుకే ఇంతటి అందంగా మృణాల్ కనిపిస్తుందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.