లెహంగాలో మృణాల్ మతి చెడే అందం
తాజాగా దసరా పండుగ సీజన్ లో మృణాల్ పూర్తిగా బ్లాక్ లుక్ ని ఎంపిక చేసుకోవడం ఆసక్తికరం.
By: Tupaki Desk | 27 Oct 2023 6:29 PM GMTదుల్కర్ సల్మాన్ నటించిన 'సీతా రామం'లో ప్రిన్సెస్ నూర్ అకా సీతా మహాలక్ష్మి పాత్రను పోషించినప్పటి నుండి మృణాల్ ఠాకూర్ ప్రభావవంతమైన నటిగా గుర్తింపు సంపాదించింది. ఈ చిత్రంలో మృణాల్ నటనతో పాటు, ఎంపిక చేసుకున్న ఎథ్నిక్ వార్డ్‌రోబ్‌తో మనందరినీ ప్రేమలో పడేలా చేసింది. తను కనిపించిన ప్రతి ఫ్రేమ్‌లో ఎంతో అందంగా కనిపించింది. మృణాల్ తన ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో సాంప్రదాయ వస్త్రధారణలో ఫోటోషూట్లతో ఆకట్టుకుంది.ఈ దసరాకి పండగ వాతావరణానికి తగ్గట్టుగా తనను తాను డిజైన్ చేసుకుంటుంది మృణాల్.
మృణాల్ ఠాకూర్ టెలివిజన్ నుండి వెండితెరకు వేగంగా పరివర్తన చెందిన ప్రతిభావని. ప్రస్తుతం పాపులర్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. ఈ బ్యూటీ తన పాత్రలకు తీసుకువచ్చే ప్రామాణికతతో ప్రతి దర్శకుడి మొదటి ఎంపికగా మారంది. సీతారామం, జెర్సీ, లస్ట్ స్టోరీస్ 2,లవ్ సోనియా వంటి చిత్రాలతో మృణాల్ ఠాకూర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందు దూకుడును ప్రదర్శించింది. అదే విధంగా ఫ్యాషన్ రంగంలో తనకు తానే సాటి అని కూడా నిరూపించింది. కేన్స్ నుండి ఫిలింఫేర్ వరకు మృణాల్ వేదిక ఏదైనా కానీ తన ప్రయోగాత్మక స్టైలిష్ ప్రదర్శనలతో హెడ్ టర్నర్ గా మారింది.
తాజాగా దసరా పండుగ సీజన్ లో మృణాల్ పూర్తిగా బ్లాక్ లుక్ ని ఎంపిక చేసుకోవడం ఆసక్తికరం. ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో ఈ భామ బ్లాక్ డిజైనర్ డ్రెస్ లో ప్రత్యక్షమైంది. నలుపు రంగు లెహంగా-చోలీలో అందమైన మృణాల్ చిలిపిగా కనిపించింది. స్టన్నింగ్ V-నెక్‌లైన్.. స్ట్రాప్‌లెస్ రివీలింగ్ బ్లౌజ్ .. బంగారు-ఎంబ్రాయిడరీ జాకెట్‌తో కాంట్రాస్ట్ లుక్ లో ఎంతో అందంగా కనిపించింది. తాజా ఫోటోషూట్ నుంచి ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
ప్రస్తుతం నాని సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. అలాగే అగ్ర హీరోలు మహేష్ -చరణ్- బన్ని- ప్రభాస్ లాంటి స్టార్ల సరసన అవకాశాలు అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికి ఆశించిన ఆఫర్లు అయితే లేవు కానీ భవిష్య త్ లో తన స్థాయిని మరింత విస్తరించే పనిలో ఉంది.
ప్రారంభ వృత్తి టెలివిజన్ (2012–2014)
కళాశాలలో చదువుతున్నప్పుడు స్టార్ ప్లస్ సిరీస్ ముజ్సే కుచ్ కెహ్తీ...యే ఖామోషియాన్‌లో మోహిత్ సెహగల్ సరసన గౌరీ భోంస్లే పాత్రలో మృణాల్ ఠాకూర్ నటించింది. ఈ షో 2012 నుండి 2013 వరకు ప్రసారమైంది. తరువాత 2013లో ఠాకూర్ మిస్టరీ థ్రిల్లర్ 'హర్ యుగ్ మే ఆయేగా ఏక్ - అర్జున్‌లో ఎపిసోడిక్ ప్రదర్శనలో కనిపించింది. ఇందులో ఆమె సాక్షి ఆనంద్ అనే జర్నలిస్టుగా నటించింది. ఫిబ్రవరి 2014లో, జీ టీవీ సోప్ ఒపెరా 'కుంకుమ్ భాగ్య'లో నటించింది. ఈ షోకి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను ఎక్కువగా పొందింది. జనవరి 2016లో ఠాకూర్ షో నుండి నిష్క్రమించింది.
ఠాకూర్ 2014లో బాక్స్ క్రికెట్ లీగ్ 1 .. 2015లో నాచ్ బలియే 7లో కంటెస్టెంట్‌గా కనిపించారు. 2016లో సౌభాగ్యలక్ష్మి ప్రత్యేక ఎపిసోడ్‌లో నృత్యం చేసింది. తుయుల్ & ఎంబాక్ యుల్ రీబార్న్‌లో అతిథి పాత్రలో కనిపించింది. టెలివిజన్ నుండి రిటైర్ కావడానికి ముందు ఆమె చివరి ప్రదర్శన ఇండోనేషియా సీరియల్ నాడిన్‌లో నటించింది. ఇందులో ఆమె తార పాత్రను పోషించింది.