Begin typing your search above and press return to search.

పాపం.. మృణాల్ పెళ్లి ప్లాన్‌ అట్టర్ ఫ్లాప్‌!

సెలబ్రెటీలు తమ వ్యక్తిగత జీవితం విషయంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పైకి మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు.

By:  Tupaki Desk   |   30 March 2024 3:30 PM GMT
పాపం.. మృణాల్ పెళ్లి ప్లాన్‌ అట్టర్ ఫ్లాప్‌!
X

సెలబ్రెటీలు తమ వ్యక్తిగత జీవితం విషయంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పైకి మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా సినిమా స్టార్స్ మరీ ముఖ్యంగా హీరోయిన్స్‌ తమ పర్సనల్‌ జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. ఇమేజ్ చట్రంలో ఇరుకున్న హీరోయిన్స్‌ బయటకు రావాలి అనుకున్నా రాలేరు.

ప్రస్తుతం టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్స్ లో మృణాల్‌ ఠాకూర్ ఒకరు అనడంలో సందేహం లేదు. పదేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్ కి సౌత్‌ లో నటించిన సీతారామం సినిమాతో హిట్‌ పడింది. దాంతో అక్కడ ఇక్కడ కూడా మృణాల్ ఫుల్‌ బిజీ అయ్యింది.

హీరోయిన్‌ గా మృణాల్‌ ఠాకూర్ నటించిన 'ఫ్యామిలీ స్టార్‌' సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ దేవరకొండ నటించిన ఆ సినిమా పై మృణాల్‌ చాలా ఆశలు పెట్టుకున్నట్లుగా ఆమె వ్యాఖ్యలు వింటే అర్థం అవుతుంది. ఆ విషయం పక్కన పెడితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్‌ లైఫ్‌ మిస్ అవుతున్నట్లు పేర్కొంది.

మృణాల్ మాట్లాడుతూ.. సెలబ్రిటీ హోదా వల్ల ఈ ప్రపంచం ప్రేమిస్తుంది. మనం చేసే పనుల వల్ల సమాజంలో మార్పు తీసుకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అదే సెలబ్రిటీ హోదా వల్ల కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. వారికి అవసరం అయినప్పుడు పక్కన ఉండలేక పోతున్నాను అంది.

చాలా సార్లు నేను కూడా సాధారణ జీవితం గడిపితే బాగుండేది అన్నట్లుగా అనిపిస్తుంది. 20+ వయసులో పెళ్లి చేసుకుని పిల్లలను కని, ఫ్యామిలీతో డిన్నర్ కోసం రెస్టారెంట్‌ కి వెళ్లొచ్చు కదా అనుకుంటాను. కానీ నాకు అది కలగానే మిగిలి పోయేలా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.

20+ ఏజ్‌ లోనే పెళ్లి చేసుకోవాలి అనుకున్న మృణాల్‌ ప్లాన్‌ మొత్తం ఫ్లాప్‌ అయ్యింది. ఇప్పటికే మృణాల్‌ 30+ వయసుకు వచ్చేసింది. ఆమె కి ఇప్పుడే స్టార్‌ డమ్ వచ్చింది. కనుక మరో పదేళ్ల వరకు ఆమె పెళ్లి ఊసు ఎత్తక పోవచ్చు. అంటే ఆమె 20+ లో అనుకున్న పెళ్లి 40+ కి చేసుకోవాల్సి రావచ్చు. సెలబ్రిటీ హోదా వల్లే కదా పాపం మృణాల్‌ పెళ్లి ప్లాన్‌ అంతా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది..!