Begin typing your search above and press return to search.

మృణాల్ మాట తప్పక తప్పట్లేదా..?

ముందు సీరియల్స్ లో నటించి ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ అందుకున్న మృణాల్ సీతారామం తో తెలుగు ఎంట్రీ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   4 Jun 2024 12:52 PM GMT
మృణాల్ మాట తప్పక తప్పట్లేదా..?
X

సినిమాల్లోకి వస్తున్నాం అంటేనే అక్కడ కొన్ని పరిస్థితులకు తలొగ్గక తప్పదని తెలిసిందే. గ్లామర్ ఫీల్డ్ లో అన్ని మనకు నచ్చినట్టు.. మనకు కలిసి వచ్చేట్టు జరుగుతాయని చెప్పడం కష్టం. అందుకే చాలా మంది సినిమాల్లోకి వెళ్తా పేరెంట్స్ ముందే నో చెప్పేస్తుంటారు. కొంతమంది మాత్రం కొన్ని కండీషన్స్ తో ఓకే చెబుతారు. బాలీవుడ్ లో సినిమాలు చేసి ఆ తర్వాత టాలీవుడ్ షిఫ్త్ అయ్యి ఇక్కడ సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్న మృణాల్ ఠాకూర్ కి కూడా ఇంట్లో వాళ్లు కండీషన్స్ పెట్టారట. ముందు సీరియల్స్ లో నటించి ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ అందుకున్న మృణాల్ సీతారామం తో తెలుగు ఎంట్రీ ఇచ్చింది.

ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అమ్మడికి ఇక్కడ సూపర్ క్రేజ్ ఏర్పడింది. సీతారామం తర్వాత నానితో హాయ్ నాన్న చేసిన మృణాల్ ఆ సినిమాతో కూడా డీసెంట్ హిట్ అందుకుంది. ఇలా చేసిన రెండు సినిమాలతో అమ్మడు సూపర్ పాపులర్ అయ్యింది. ఇక థర్డ్ మూవీ విజయ్ దేవరకొండతో ది ఫ్యామిలీ స్టార్ చేయదా అది కాస్త బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఐతే సినిమా ఫ్లాప్ అయినా మృణాల్ తనకు ఇచ్చిన పాత్రకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే అమ్మడు బాలీవుడ్ లో ఎక్కువగా అవకాశాలు రావట్లేదని బాధపడుతుంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే టైం లో బోల్డ్ పాత్రల్లో నటించనని తండ్రికి మాట ఇచ్చిందట మృణాల్ ఠాకూర్. ఐతే బాలీవుడ్ లో మాత్రం అమ్మడికి అలాంటి పాత్రలు రావడం వాటికి నో చెప్పడం జరుగుతుంది.

తండ్రికి ఇచ్చిన మాట కోసం బోల్డ్ పాత్రల్లో నటించకూడదని ఫిక్స్ అయిన మృణాల్ ఇలానే ఉంటే కెరీర్ రిస్క్ లో పడుతుందని గుర్తించి మాట తప్పాలని ఫిక్స్ అయ్యిందట. ఈమధ్యనే బాలీవుడ్ లో ఒక సినిమా ఛాన్స్ రాగా అందులో ఒక రేంజ్ లో రెచ్చిపోవాల్సి ఉన్నా ఎలాంటి డౌట్ లేకుండా ఓకే చెప్పిందట అమ్మడు. మృణాల్ ఠాకూర్ నిర్ణయం ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ని ఇబ్బంది పెట్టొచ్చేమో కానీ కొన్నాళ్లు కెరీర్ ఇలానే కొనసాగాలంటే మాత్రం అమ్మడు ఇలా చేయక తప్పదు. తెలుగులో మాత్రం మృణాల్ కి మంచి మంచి పాత్రలే వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఈ హీరోయిన్ కి తిరుగులేదని చెప్పొచ్చు.