Begin typing your search above and press return to search.

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? ఎంత ఛేంజో!!

ఓరగా చూస్తున్న మృణాల్ ఠాకూర్ కు చెందిన ఆ ఫోటో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆమెను అస్సలు గుర్తు పట్టలేకపోతున్నామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

By:  Tupaki Desk   |   20 Jun 2024 2:30 AM GMT
ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? ఎంత ఛేంజో!!
X

సినీ ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు పరిచయమవుతూనే ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త బ్యూటీలు సినీ ప్రియులను పలకరిస్తుంటారు. వారిలో కొందరు.. సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకుని ఇండస్ట్రీలోకి వస్తుంటారు. ఇంకొందరు మోడల్ గా మంచి పేరు సంపాదించాక సినిమా అవకాశాలు దక్కించుకుంటారు. మరికొందరు వారసురాళ్లుగా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్లుగా గుర్తింపు సొంతం చేసుకుంటారు.

కొందరు చిన్న సినిమాల్లో సైడ్ యాక్టర్లుగా నటించి హీరోయిన్లుగా మారుతుంటారు. షార్ట్ ఫిల్మ్స్ తో క్రేజ్ దక్కించుకుని హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంటారు. మరికొందరు సీరియల్స్ లో నటించి సినిమాల్లో అడుగు పెడుతుంటారు. ఇప్పుడు మీరు పైన చూసిన పిక్ కూడా అలా హీరోయిన్ అయిన బ్యూటీదే. కానీ హీరోయిన్ అయ్యాక ఆమెలో అనేక మార్పులు వచ్చాయి. మరి ఆ బ్యూటీ ఎవరో మీరు ఇప్పుడు గుర్తుపట్టారా?

తక్కువ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆ బ్యూటీ.. కుర్రాళ్ల మనసులు దోచేసింది. తెలుగులో ఫస్ట్ మూవీతో స్పెషల్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. తన పాత్రతో టాలీవుడ్ సినీ ప్రియుల మదిలో నిలిచిపోయింది. రెండో సినిమాతో కూడా మంచి హిట్ అందుకుంది. బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కోలీవుడ్ ఆఫర్లు అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఎవరో కాదు మృణాల్ ఠాకూర్.

ఓరగా చూస్తున్న మృణాల్ ఠాకూర్ కు చెందిన ఆ ఫోటో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆమెను అస్సలు గుర్తు పట్టలేకపోతున్నామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అమ్మడిలో చాలా ఛేంజ్ వచ్చిందని చెబుతున్నారు. బాలీవుడ్ లవ్ సోనియా సినిమాలోనిది ఆ ఫోటో. స్టార్ యాక్టర్ రాజ్ కుమార్ రావ్ సహా పలువురు నటించిన ఆ మూవీ.. 2018లో రిలీజైంది. ఇప్పుడు ఆ పిక్ వైరల్ అవుతోంది.

అయితే టాలీవుడ్ లోకి సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మృణాల్.. ఇటీవల ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. కానీ మూవీ మాత్రం అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయలేదు మృణాల్. కానీ మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ విశ్వంభరలో ఆమె యాక్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి కొత్త సినిమాలతో మృణాల్ ఠాకూర్ ఎలాంటి హిట్లు అందుకుంటుందో వేచి చూడాలి.