జింకలా సంచరించే జీవి ఈ హీరోయిన్!
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ స్వేచ్ఛా జీవి అని చాటి చెప్పింది. ' నా పేరుకి అర్దం జింక. దాని లాగే నేను ఎప్పుడూ తిరుగుతుంటాను.
By: Tupaki Desk | 10 Oct 2023 4:30 PM GMT'సీతారామం' తో పూణే బ్యూటీ మృణాల్ ఠాకూర్ తెలుగింట ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ఆ సక్సెస్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నా? అమ్మడు ఇప్పుడు పుల్ బిజీగా ఉంది. తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాలు చేస్తోంది. నేచురల్ స్టార్ నాని సరసన 'హాయ్ నాన్న'లో...విజయ్ దేరకొండ తో మరో సినిమా చేస్తుంది. హిందీ లో రెండు..మూడు సినిమాల షూటింగ్ పూర్తయింది.
వాటి విడుదల కోసం ఎదురు చూస్తుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ స్వేచ్ఛా జీవి అని చాటి చెప్పింది. ' నా పేరుకి అర్దం జింక. దాని లాగే నేను ఎప్పుడూ తిరుగుతుంటాను. ఒకే చోట స్థిరంగా ఉండలేను. ఖాళీ ఉంటే కొత్త ప్రదేశాలు చూడటానికి ఇష్టపడతాను. అందుకే దేశాలు..ఖండాలు దాటిపోతుంటాను. ఈ విషయంలో తల్లిదండ్రులు వారిస్తుంటారు. ఎందుకలా తిరుగుతావ్? అంటుంటారు.
అయినా వాటిని పట్టించుకోను. కొత్త ప్రదేశాల్లో కొత్త అనుభూతులు ఎంతో ఆనందాన్ని పంచుతాయి. అది నాలో తిరిగిన వాళ్లకే తెలుస్తుంది. నేను సినిమా షూటింగ్ లకు వెళ్లినా..అక్కడ అదనంగా రెండు..మూడు రోజులు ఉండిపోయేలా ప్లాన్ చేసుకుంటా. తిరిగిన ప్రదేశాలు..రెస్టారెంట్లు..పద్దతులు అన్నిటిని పంచుకోవడం ఇష్టం. అందుకే సోషల్ మీడియాలో అన్ని విషయాలు చెప్పేస్తుంటాను.
నేను ఎన్ని బాధల్లో ఉన్నా సంతోషానికి కారణం ఇలా తిరగడమే. వీలైనంత వరకూ అందమైన ప్రదేశాలన్నీ చుట్టు రావాలి. ఇక పండగ సమయాల్లో చేసే ప్రయాణాలు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. దేశ వ్యాప్తంగా తిరిగినప్పుడు ఏ సంప్రదాయంలో ఎలాంటి పండగలు జరుగుతాయో నాకు బాగా తెలుసు. 'జబ్ వీ మెట్' లో కరీనా కపూర్ ఢిల్లీ నుంచి బఠిండా వరకూ వెళ్తుంది. అది చూసి నేనెందుకు వెళ్లకూడద నిపించింది. విషయం అమ్మనాన్నకి చెప్పి ముంబై నుంచి కేరళకి రైలులో బయల్దేరాను.' అని అంది.