Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : నిండైన అందాల మృణాల్‌

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మృణాల్ ఠాకూర్ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

By:  Tupaki Desk   |   14 July 2024 7:01 AM GMT
పిక్ టాక్ : నిండైన అందాల మృణాల్‌
X

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మృణాల్ ఠాకూర్ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ వెంటనే హాయ్‌ నాన్న సినిమాలో కూడా నటించడం ద్వారా టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా మారింది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న మృణాల్ ఠాకూర్ మరో వైపు సోషల్‌ మీడియాలో ఇలాంటి కన్నుల విందు ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వైరల్‌ అవుతూ ఉంటుంది. తాజాగా మరోసారి అందాల మృణాల్ నిండైన అందాల ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.

సాధారణంగా హీరోయిన్స్ స్కిన్‌ షో చేస్తేనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతారు. కానీ మృణాల్ ఇలా నిండుగా కప్పుకున్న ఫోటో షూట్‌ ని షేర్‌ చేసినా కూడా వైరల్‌ అవుతుంది. ఆ ఫేస్ లో అందం కొట్టొచ్చినట్లుగా ఉందని, నిండైన అందం మా మృణాల్ ది అన్నట్లుగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆకట్టుకునే రూపంతో పాటు మంచి ఫిజిక్ మృణాల్‌ సొంతం. అందుకే ఆమె ఎప్పుడు ఏ ఫోటో షేర్‌ చేసినా కూడా ఇలాగే వైరల్‌ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ముందు ముందు టాలీవుడ్‌ తో పాటు బాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ లో కూడా వరుస విజయాలను ఈ అమ్మడు దక్కించుకుంటుందేమో చూడాలి.