మృణాల్.. అక్కడ కూడా గట్టిగానే లాగుతోంది
బయట హాట్ అండ్ గ్లామర్ గా ఉండటానికి మృణాల్ ఠాకూర్ ఇష్టపడుతుంది. అయితే సినిమాలలో మాత్రం ఆమెకి కంప్లీట్ భిన్నమైన క్యారెక్టర్స్ వస్తున్నాయి
By: Tupaki Desk | 14 Feb 2024 2:30 PMసీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు నటిగా కూడా విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ఆమె బాలీవుడ్ లో ఎందుకు సక్సెస్ ఫుల్ యాక్టర్ అయ్యిందో సీతారామంలో ఆమె పెర్ఫార్మెన్స్ బట్టి చెప్పొచ్చు. కళ్ళతోనే భావాలని పలికించి అందరి మనస్సులు దోచుకుంది.
బయట హాట్ అండ్ గ్లామర్ గా ఉండటానికి మృణాల్ ఠాకూర్ ఇష్టపడుతుంది. అయితే సినిమాలలో మాత్రం ఆమెకి కంప్లీట్ భిన్నమైన క్యారెక్టర్స్ వస్తున్నాయి. గ్లామర్ షో కంటే పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రల కోసం దర్శక, నిర్మాతలు మృణాల్ ఠాకూర్ ని ఎంపిక చేసుకుంటున్నారు. గత ఏడాది నేచురల్ స్టార్ నానికి జోడీగా హాయ్ నాన్నతో మరో సూపర్ హిట్ అందుకుంది. ఇందులో కూడా ఆమె అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది.
వరుసగా రెండు సక్సెస్ లు రావడంతో మృణాల్ ఠాకూర్ డిమాండ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఒక్కో సినిమాకి 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందంట. ప్రస్తుతం విజయ్ దేవరకొండకి జోడీగా ఫ్యామిలీ స్టార్ చిత్రంలో మృణాల్ నటించింది. ఈ మూవీ కూడా సక్సెస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తమిళంలో ఎంట్రీకి రెడీ అవుతోంది. అక్కడ కమల్ హాసన్ ప్రొడక్షన్ లో శింబు హీరోగా తెరకెక్కబోయే సినిమాలో మృణాల్ కి ఛాన్స్ వచ్చింది.
ఆ చిత్రం కోసం 3 కోట్ల రెమ్యునరేషన్ ని ఆమె డిమాండ్ చేస్తుందంట. కమల్ హాసన్ లాంటి స్టార్ హీరో ప్రొడక్షన్ నుంచి వస్తోన్న మూవీ అయిన కూడా తన మార్కెట్ కి తగ్గ రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తుందంట. అలాగే మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కబోయే పాన్ ఇండియా సినిమా కోసం మృణాల్ ని ఖారారు చేయబోతున్నారంట.
ఈ రెండు సినిమాలకి 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ ని ఆమె అందుకుంటుందని తెలుస్తోంది. మృణాల్ ఠాకూర్ ని హీరోయిన్ గా చేసుకుంటే హిందీలో కూడా ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఇప్పటికే ఆమె ఎస్టాబ్లిష్ స్టార్ యాక్టర్. అందుకే ఆమె అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా సిద్ధం అవుతున్నట్లు టాక్ నడుస్తోంది.