Begin typing your search above and press return to search.

మృణాల్.. మరో హిట్టోస్తే రెమ్యునరేషన్ ఎంత పెరుగుతుందో?

ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ హిట్టయితే ఆమె రెమ్యునరేషన్ రేటు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

By:  Tupaki Desk   |   2 April 2024 5:45 AM GMT
మృణాల్.. మరో హిట్టోస్తే రెమ్యునరేషన్ ఎంత పెరుగుతుందో?
X

టాలీవుడ్ సీతగా మంచి గుర్తింపు అందుకున్న మృణాల్ ఠాకూర్ మరో రెండు రోజుల్లో ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు జోడీగా కనిపించనుంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్.. ఈ చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. సినిమా కచ్చితంగా హిట్ అవుద్దని నిర్మాత దిల్ రాజుతో పాటు మూవీ టీమ్ అంతా నమ్మకంతో ఉంది.

ఇక సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. ఫస్ట్ మూవీతోనే తనదైన గుర్తింపు సంపాదించుకుంది. సీతగా తన అందంతో ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. తన అభినయంతో అందరి మనసులు దోచుకుంది. ఆ సినిమా తర్వాత వరుసగా ఆఫర్లు దక్కించుకుంది. కానీ ఆచితూచి అడుగులేస్తోంది మృణాల్. గతేడాది హాయ్ నాన్న సినిమాలో నాని సరసన నటించి ఆకట్టుకుంది.

ఈ సినిమాలో కూడా తన యాక్టింగ్ తో మంచి ప్రశంసలు అందుకుంది మృణాల్ ఠాకూర్. తెలుగులో ఆమె చేసిన తొలి రెండు మూవీలు సీతారామం, హాయ్ నాన్న థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా హిట్లు అయ్యాయి. సినిమాలో హీరోయిన్ రోల్ కు మంచి స్కోప్ ఉన్న ప్రాజెక్టులకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న మృణాల్.. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ తో సందడి చేయనుంది. టాలీవుడ్ లో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయింది.

సీతారామం వరకు అమ్మడి రెమ్యునరేషన్ కోటి కంటే తక్కువే ఉండేది. ఆ తరువాత హాయ్ నాన్న హిట్టుతో లెక్క కోటి దాటింది. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ హిట్టయితే ఆమె రెమ్యునరేషన్ రేటు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. తెలుగులో వరుసగా హిట్లు కొడుతుండడంతో ఆమెను లక్కీ గర్ల్ అని పిలవడం ప్రారంభించారు సినీ ప్రియులు.

అయితే తనకు ఆ లేబుల్ ఇష్టం లేదని, యాక్టింగ్ అనేది తనకొక జాబ్ లాంటిదని చెప్పింది. తనకు నటన ప్యాషన్ అని వెల్లడించింది. తనకు బాగా కనెక్ట్ అయ్యే రోల్స్ ను మాత్రమే ఎంచుకుంటానని తెలిపింది. సీతారామంలో సీతగా, హాయ్ నాన్నలో యష్ణగా కనిపించిన తాను.. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ లో ఇందుగా సందడి చేయనున్నట్లు చెప్పింది.

ఇక ఫ్యామిలీ స్టార్ విజయం మృణాల్ తో పాటు విజయ్ దేవరకొండకు కూడా కీలకమే. లైగర్ తో భారీ డిజాస్టర్ అందుకున్న విజయ్..ఆ తరువాత ఖుషితో పరవాలేదు అనిపించాడు. ఇక ఈ సినిమాతో గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న మృణాల్ కెరీర్ గ్రాఫ్ ను ఈ మూవీ పెంచే ఛాన్స్ ఉంది అలాగే స్టార్ హీరోయిన్ ట్యాగ్ తెచ్చి పెడుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో!