Begin typing your search above and press return to search.

'సీతారామం'ని మ‌ర్చిపోలేని మృణాల్!

2022 బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `సీతారామం`ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేదు మృణాల్ ఠాకూర్. ఈ సినిమా విజ‌యం ఈ బ్యూటీ కెరీర్‌కి ఆక్సిజ‌న్ ని నింపింది

By:  Tupaki Desk   |   26 July 2024 3:03 PM GMT
సీతారామంని మ‌ర్చిపోలేని మృణాల్!
X

2022 బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `సీతారామం`ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేదు మృణాల్ ఠాకూర్. ఈ సినిమా విజ‌యం ఈ బ్యూటీ కెరీర్‌కి ఆక్సిజ‌న్ ని నింపింది. అలాంటి గొప్ప అవ‌కాశం క‌ల్పించిన వైజ‌యంతి మూవీస్ ని, హ‌ను రాఘ‌వ‌పూడిని, అలాగే ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ని మృణాల్ ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేదు. ఈ సినిమాలో న‌ట‌న‌కు గాను ఉత్త‌మ న‌టిగా మృణాల్ ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఫిలింఫేర్ పుర‌స్కారాన్ని గెలుచుకుంది. ఈ అవార్డును మ‌రోసారి షేర్ చేసిన మృణాల్ తాజాగా మ‌రోసారి వైజ‌యంతిని త‌ల‌చి వారికి ధ‌న్య‌వాదాలు తెలిపింది. ఆస‌క్తిక‌రంగా మృణాల్ ఇటీవ‌ల విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన క‌ల్కి 2989 ఏడిలోను అతిథి పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. వైజ‌యంతి మూవీస్, నాగి మ‌రో కీల‌క ప్రాజెక్టులో మృణాల్ కి అవ‌కాశం క‌ల్పించ‌డంతో వారికి మ‌రోసారి ధ‌న్య‌వాదాలు తెలిపింది. వైజ‌యంతి బ్యాన‌ర్ కి స‌ర్వ‌దా రుణ‌ప‌డి ఉంటాన‌ని మృణాల్ త‌న విధేయ‌త‌ను చాటుకుంటూనే ఉంది సోష‌ల్ మీడియాల్లో. స్నేహితులు నా కోసం ఈ మినీ అవార్డ్ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసినందుకు ధ‌న్య‌వాదాలు కూడా తెలియ‌జేసింది ఇన్ స్టాలో.

ప్ర‌భాస్ స‌ర‌స‌న ఛాన్స్?

అదంతా అటుంచితే మృణాల్ త‌దుప‌రి ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించ‌నుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించ‌నున్న భారీ పీరియడ్ డ్రామాలో మృణాల్ ఠాకూర్ ఛాన్స్ ద‌క్కించుకోనుందని క‌థ‌నాలొస్తున్నాయి. ఇందులో ప్ర‌భాస్ ప్రేమికురాలిగా మృణాల్ న‌టించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. నిజానికి జాన్వీ కపూర్, రష్మిక మందన్న వంటి ఇతర అగ్ర నటీమణుల పేర్లను మేకర్స్ పరిశీలించారు. కానీ మేక‌ర్స్ మృణాల్‌ను నటింపజేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. సీతా రామంలో యువరాణిగా మృణాల్ న‌ట‌న‌కు ఎక్కువ స్కోర్ చేసింది. అందంగా కనిపించడమే కాకుండా హృద‌యాల‌ను హ‌త్తుకునే నటనను ప్రదర్శించింది. అందుకే దర్శకుడు మృణాల్‌ని తన తదుపరి పీరియాడిక్ డ్రామాలో హ‌ను త‌న‌ను రిపీట్ చేస్తార‌ని భావిస్తున్నారు.

ఇంతకుముందు `హాయ్ నాన్న`లోను నాని స‌ర‌స‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో మృణాల్ ఆక‌ట్టుకుంది. అలాగే `ది ఫ్యామిలీ స్టార్`లో విజయ్ దేవరకొండతో స్క్రీన్ స్పేస్‌ను షేర్ చేస్కుంది. ఇప్పుడు ప్ర‌భాస్ స‌ర‌స‌న అవ‌కాశం ద‌క్కించుకోబోతోంద‌ని ప్ర‌చారం వేడెక్కిస్తోంది.