Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మృణాల్ మెరుపులు ఉరుములు

సూపర్ 30 - బాట్లా హౌస్ వంటి జీవిత చరిత్ర చిత్రాలలో మృణాల్ ఠాకూర్ తన పాత్రల ద్వారా విస్తృతమైన గుర్తింపును పొందారు.

By:  Tupaki Desk   |   22 Jan 2024 6:22 PM GMT
ఫోటో స్టోరి: మృణాల్ మెరుపులు ఉరుములు
X

మృణాల్ ఠాకూర్ తెలుగు-హిందీ చిత్రాలలో న‌టిస్తూ పాపులర్ అయిన‌ ప్రతిభావంతురాలు. ముజ్సే కుచ్ కెహ్తీ...యే ఖామోషియాన్ వంటి టెలివిజన్ సోప్ ఒపెరాలతో తన కెరీర్‌ను ప్రారంభించి, లవ్ సోనియాలో తన ప్రభావవంతమైన అరంగేట్రంతో పెద్ద తెరపైకి మారింది.


సూపర్ 30 - బాట్లా హౌస్ వంటి జీవిత చరిత్ర చిత్రాలలో మృణాల్ ఠాకూర్ తన పాత్రల ద్వారా విస్తృతమైన గుర్తింపును పొందారు. కొన్ని పేలవమైన హిందీ చిత్రాలతో నిరాశ ఎదురైనా కానీ.. సీతా రామం - హాయ్ నాన్న వంటి తెలుగు రొమాంటిక్ డ్రామాలతో తిరిగి కెరీర్ లో ఉత్త‌మ‌ విజయాల‌ను సాధించింది. ఒక ర‌కంగా తెలుగు సినీప‌రిశ్ర‌మ మృణాల్ కి గొప్ప అవ‌కాశాల్ని క‌ల్పించ‌డ‌మే గాక అదృష్టాన్ని కూడా క‌ట్ట‌బెడుతోంద‌ని చెప్పాలి. ఇప్ప‌టికే ఈ భామ ప్ర‌తిభ‌కు రెండు SIIMA అవార్డులు ద‌క్కాయి.


ఫెమినా ఇండియా ముఖచిత్రం కోసం ఇటీవలి ఫోటోషూట్‌లో మృణాల్ ఠాకూర్ తన అద్భుతమైన అంద‌చందాల‌తో క‌ట్టి ప‌డేసింది. బ్లాక్ బ్లేజర్‌లో మృణాల్ ఎంతో అందంగా క‌నిపిస్తోంది. మృణాల్ అందం ఆత్మ‌విశ్వాసం అభిమానులను ఆకర్షించింది. బ్లాక్ బ్లేజ‌ర్ తో కొన్ని ఫోటోల్లో బాస్ లేడీ వైబ్స్ ని క్రియేట్ చేసిన మృణాల్ .. మిరుమిట్లు గొలిపే చ‌మ్కీల దుస్తుల్లో మెరుపులు మెరిపించింది. ముఖ్యంగా మృణాల్ బ్యాక్ లెస్ ఫోజులు మ‌తులు చెడ‌గొట్టాయి.


యాక్షన్ - క‌ట్ మధ్య టైమ్ అనే మ్యాజిక్ జరుగుతుంది.. #CoverGirl @ఫెమీనా ఇండియా అంటూ మృణాల్ ఈ ఫోటోల‌ను షేర్ చేసింది. సుర్భిశుక్లా మృణాల్ కి స్టైలింగ్ చేసారు. #MrunalThakur #FeminaJanuary2024 #FeminaCover #FeminaXMrunalThakur అంటూ ట్యాగుల్ని జోడించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.


తదుప‌రి కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. విజయ్ దేవరకొండతో కలిసి త‌దుప‌రి తెలుగు చిత్రం `ఫ్యామిలీ స్టార్`లో న‌టిస్తోంది. బహుముఖ ప్రతిభ మనోహరమైన వ్యక్తిత్వంతో మృణాల్ ఠాకూర్ సినీప్రపంచంలో శాశ్వత ముద్రను వేస్తోంది.