Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కోసం మృణాల్.. క్రేజీ కాంబో!

ఇక ముందుగానే చిత్ర నిర్మాతలు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ లిస్టులోకి కొంతమంది హీరోస్ పేర్లను తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   6 Sep 2023 4:09 PM GMT
మెగాస్టార్ కోసం మృణాల్.. క్రేజీ కాంబో!
X

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడది మొదట్లోనే వాల్తేరు వీరయ్య సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నాడు. అయితే ఆ సక్సెస్ అందుకున్న కొన్ని నెలలకే మళ్లీ ఊహించని విధంగా కెరీర్ లోనే మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ చూడాల్సి వచ్చింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో చేసిన భోళా శంకర్ సినిమా దారుణంగా దెబ్బకొట్టింది. అయితే కాస్త గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా ప్రాజెక్టును సిద్ధం చేసుకుంటున్నాడు.

ఈసారి ఏకంగా సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీతో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు వశిష్ట మెగాస్టార్ చిరంజీవికి ఇది వరకే మేయిన్ కథకు చెప్పిన విషయం తెలిసిందే. మెయిన్ లైన్ వినగానే ఇంప్రెస్ అయిన చిరంజీవి పూర్తి తరహాలో పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ రెడీ చేయమని సిగ్నల్ కూడా ఇచ్చాడు. ఇక నవంబర్ నాటికి దర్శకుడు వశిష్ట పూర్తి స్థాయిలో బౌండెడ్ స్క్రిప్టును సిద్ధం చేసేందుకు ఒక టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకున్నాడు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మెగాస్టార్కు జోడిగా ఎవరు నటిస్తారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇక ముందుగానే చిత్ర నిర్మాతలు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ లిస్టులోకి కొంతమంది హీరోస్ పేర్లను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే అందులో మొదటి ఆప్షన్ గా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాగూర్ ను అనుకుంటున్నట్లుగా సమాచారం.

ఆమె అయితే ఈ కథకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని దర్శకుడు కూడా తన ఆలోచనలు మెగాస్టార్ ముందు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ విషయంలో నిర్మాతలు కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే లిస్టులో ఉన్న మరి కొంతమంది పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.

కానీ మెగాస్టార్ మృణాల్ కాంబినేషన్ బాగుంటుంది అనే విధంగానే దర్శకుడు ఆలోచిస్తున్నాడట. మరి నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ కూడా రెమ్యునరేషన్ పెంచేసింది. పాన్ ఇండియా ప్రాజెక్టులు కూడా చేసే అవకాశం ఉంది. ఇక త్వరలోనే చిరు ప్రాజెక్ట్ విషయంలో అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం. ఇక రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది మొదట్లోనే స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.