Begin typing your search above and press return to search.

ట్రోల్స్‌ : కృతజ్ఞత చూపని మృణాల్‌..!

చాలా ఏళ్లుగా ఉత్తరాదిన సీరియల్స్ మరియు సినిమాలు చేస్తున్నా కూడా అక్కడి వారు మృణాల్‌ ను పట్టించుకోలేదు.

By:  Tupaki Desk   |   24 May 2024 9:30 AM GMT
ట్రోల్స్‌ : కృతజ్ఞత చూపని మృణాల్‌..!
X

చాలా ఏళ్లుగా ఉత్తరాదిన సీరియల్స్ మరియు సినిమాలు చేస్తున్నా కూడా అక్కడి వారు మృణాల్‌ ను పట్టించుకోలేదు. బుల్లి తెర మరియు వెండి తెరపై మృణాల్‌ పెద్దగా సత్తా చాటలేక పోయింది. ఇక మృణాల్ కెరీర్ ఖతం అనే చర్చ ఉత్తరాదిన జరుగుతున్న సమయంలో అనూహ్యంగా తెలుగు లో సీతారామం సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.


హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీతారామం సినిమా ఆమె కెరీర్ ను అనూహ్య మలుపు తిప్పింది అనడంలో సందేహం లేదు. హాయ్ నాన్న సినిమా కూడా హిట్ అవ్వడంతో మృణాల్ కెరీర్‌ మరింత ఊపందుకుంది. తాజాగా విడుదల అయిన ఫ్యామిలీ స్టార్‌ ఫ్లాప్ అయినా కూడా ఆమె కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.

వరుసగా ఆమె కు బడా ఆఫర్లు వస్తున్నాయి. అంతే కాకుండా ఇక్కడ ఆమెకు భారీ పారితోషికంను నిర్మాతలు ఆఫర్‌ చేస్తున్నారు. అయినా కూడా ముద్దుగుమ్మ మృణాల్‌ మాత్రం బాలీవుడ్‌ వైపు ఎక్కువ ఆసక్తి చూపించడం విమర్శలకు తావు ఇస్తుంది.

హిందీలో ఆమెకు పెద్దగా క్రేజ్ లేదు, అయినా కూడా ఆమె హిందీలోనే సినిమా చేయాలని ఆశ పడుతుందట. ఇటీవల అక్కడి దర్శక నిర్మాతలతో తనకు సౌత్‌ లో ఉన్న క్రేజ్ ను చూపించి ఆఫర్లు అడుగుతుంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

మృణాల్‌ బాలీవుడ్‌ కోరిక పై సౌత్‌ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇది అస్సలు పద్ధతి కాదు అని విమర్శిస్తున్నారు. టాలీవుడ్‌ నీకు ఎంతో చేసింది. ఇన్నాళ్లుగా దక్కని హిట్ మరియు పారితోషికం వచ్చేలా చేసింది. అయినా కూడా కృతజ్ఞత అనేది చూపించకుండా ఇలా చేయడం ఏంటి అన్నట్టుగా విమర్శలు చేస్తున్నారు.

మృణాల్‌ ప్రస్తుతం తమిళంలో ఒక సినిమాను తెలుగు లో రెండు సినిమాలను కమిట్‌ అయ్యింది. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంత బిజీగా ఉన్నా కూడా బాలీవుడ్‌ సినిమాల కోసం ఈ అమ్మడు ప్రయత్నాలు చేయడం విశేషం.