Begin typing your search above and press return to search.

సితారామం జోడి.. ఇంకా అదే జోష్!

ఇదిలా ఉంటే దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్భంగా మృణాల్ ఠాకూర్ అతనికి విషెష్ చెప్పింది.

By:  Tupaki Desk   |   28 July 2023 1:07 PM GMT
సితారామం జోడి.. ఇంకా అదే జోష్!
X

సీతారామం మూవీ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఈ బ్యూటీ మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల ని తనవైపుకి తిప్పుకుంది. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఈ చిత్రం తర్వాత ప్రస్తుతం మరో మూడు సినిమాలు చేసే అవకాశం మృణాల్ ఠాకూర్ సొంతం చేసుకుంది. నాని, విజయ్ దేవరకొండల తో కమిట్ అయిన సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

మాస్ మహారాజ్ రవితేజకి జోడీ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మూవీకి మృణాల్ రీసెంట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా వరుస అవకాశాలు అందుకుంటూ ఈ బ్యూటీ దూసుకుపోతోంది. మరో వైపు సీతారామం సక్సెస్ తో దుల్కర్ సల్మాన్ క్రేజ్ కూడా టాలీవుడ్ లో పెరిగింది. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే సినిమాని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.

సితారా ఎంటర్టైన్మెంట్స్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్భంగా మృణాల్ ఠాకూర్ అతనికి విషెష్ చెప్పింది. ఇంటరెస్టింగ్ ఫోటోల ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకొని విషెస్ తెలియజేయడం విశేషం. ఈ ఫోటోలు సోషల్ మీడియా లో ప్రస్తుతం వైరల్ గా మారాయి.

సీతారామం సినిమా టైం లో తీసుకున్న ఇంటరెస్టింగ్ ఫోటోలని మృణాల్ ఠాకూర్ షేర్ చేసింది. అద్భుతమైన కోస్టార్, యూనిక్ యాక్టర్ అయిన దుల్కర్ కి సీతగారు హార్ట్ వార్మింగ్ విషెస్ అంటూ ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ఈ విషెష్ కి దుల్కర్ సల్మాన్ కూడా రిప్లై ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా సీతారామం సినిమా జోడీ గా దుల్కర్, మృణాల్ టాలీవుడ్ ప్రేక్షకుల కి ఎప్పటికి గుర్తుండిపోతారు. ఇక లక్కీ భాస్కర్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు సితారా ఎంటర్టైన్మెంట్స్ అతనికి బర్త్ డే విషెస్ చెప్పింది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నుంచి కింగ్ ఆఫ్ కోటా అనే మూవీ పాన్ ఇండియా స్థాయి లో తెరకెక్కుతోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ కథతో ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది.