Begin typing your search above and press return to search.

సిద్దు ముద్దు పెట్టుకోవ‌డానికి ఒక్క ప్లేస్ కూడా లేదా?

జాక్ సినిమా నుంచి కిస్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. అయితే అన్ని సాంగ్స్ లా పాట‌లోని ప‌ల్ల‌విని ప్రోమోగా రిలీజ్ చేయ‌కుండా ఓ రొమాంటిక్ సీన్ ను రిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   14 March 2025 6:05 PM IST
సిద్దు ముద్దు పెట్టుకోవ‌డానికి ఒక్క ప్లేస్ కూడా లేదా?
X

టిల్లూ స్వ్కేర్ సినిమాతో గ‌తేడాది రూ.100 కోట్ల క్ల‌బ్ లో చేరాడు స్టార్ బాయ్ సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌. టిల్లూ స్క్వేర్ స‌క్సెస్ ఇచ్చిన జోష్ లో సిద్దూ ప్ర‌స్తుతం రెండు సినిమాల‌ను లైన్ లో పెట్టాడు. వాటిలో ఒక‌టి బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న జాక్ మూవీ కాగా మ‌రొకటి నీర‌జ కోన ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌య‌వుతూ చేస్తున్న తెలుసు క‌దా.

ఈ రెండింటిలో జాక్ మూవీ ముందుగా రిలీజ్ కానుంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్ పై బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానున్న‌ట్టు మేక‌ర్స్ ఇప్ప‌టికే అనౌన్స్ చేశారు. ఆల్రెడీ సిద్దు బ‌ర్త్ డే సంద‌ర్భంగా జాక్ నుంచి రిలీజ్ చేసిన టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చిన విషయం తెలిసిందే.

ఇప్పుడు రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ మ్యూజిక‌ల్ ప్ర‌మోష‌న్స్ ను స్టార్ట్ చేసింది. జాక్ సినిమా నుంచి కిస్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. అయితే అన్ని సాంగ్స్ లా పాట‌లోని ప‌ల్ల‌విని ప్రోమోగా రిలీజ్ చేయ‌కుండా ఓ రొమాంటిక్ సీన్ ను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో సిద్దు , వైష్ణ‌వి చైత‌న్య ఇద్ద‌రూ చాలా రొమాంటిక్ గా క‌నిపించారు.

ప్రోమో చూస్తుంటే సినిమాలో వైష్ణ‌వి, సిద్దు మ‌ధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అయిన‌ట్టే అనిపిస్తుంది. ఇదిలా ఉంటే జాక్ మూవీకి న‌లుగురు మ్యూజిక్ డైరెక్ట‌ర్లు సంగీతం అందిస్తున్నారు. సురేష్ బొబ్బిలి, ర‌థ‌న్, అచ్చు, సామ్ సీఎస్ ఈ సినిమాకు ప‌ని చేస్తున్నారు. శ్రీ చ‌ర‌ణ్ బీజీఎం అందించ‌నున్నాడు. ఇప్పుడు రిలీజ్ చేసిన కిస్ సాంగ్ కు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.