మిస్ శెట్టి.. మిస్టర్ శెట్టి.. మళ్ళీ అదే తంతు!
అసలు మూవీని ఎందుకు వాయిదా వేశారు అనే విషయాన్ని కూడా మేకర్స్ చెప్పక్కపోవడం గమనార్హం. మరి, ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో చూడాలి.
By: Tupaki Desk | 26 July 2023 5:41 AM GMTవిభిన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో దూసుకుపోతున్న యువ హీరో నవీన్ పొలిశెట్టి. ఆయన హీరోగా, స్టార్ హీరోయిన్ అనుష్క జంటగా కలిసి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలి శెట్టి. ఈ సినిమాతో అనుష్క చాలా కాలం తర్వాత తెరపై కనిపించనుందది. అందులోనూ అనుష్క లాంటి స్టార్ హీరోయిన్, యువ హీరో నవీన్ పొలిశెట్టితో చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ లు విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ప్రముఖ నిర్మాణ యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. నిజానికి, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 4న విడుదల కావాల్సి ఉండగా, మరోసారి వాయిదా పడింది. నిజానికి గతంలో ఓసారి వాయిదా పడింది. ఆ వాయిదా పడిన తర్వాత, ఆగస్టు 4వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఈ తేదీని కూడా వాయిదా వేయడం విశేషం.
కొత్త తేదీని ఇప్పటి వరకు ప్రకటించలేదు. అసలు మూవీని ఎందుకు వాయిదా వేశారు అనే విషయాన్ని కూడా మేకర్స్ చెప్పక్కపోవడం గమనార్హం. మరి, ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా, మూవీ ట్రైలర్, టీజర్లు మాత్రం విపరీతంగా ఆకట్టుకున్నాయి. రామ్ చరణ్ సైతం టీజర్ చూసి తనకు ఎంతో బాగా నచ్చింది అంటూ కామెంట్ చేయడం విశేషం.
ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు మూడు పాటలు విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. మరీ సూపర్ గా లేకపోయినా, ఆకట్టుకునేలా ఉన్నాయి. అనుష్క చాలా కాలం తర్వాత నటిస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో నటిస్తుండగా, నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా కనిపిస్తున్నారు.
అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క.. స్టాండప్ కమెడియన్ సిద్ధు పొలిశెట్టి పాత్రలో నవీన్ పొలిశెట్టి కనిపించనున్నారు. పి మహేష్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.
వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతోంది.. అసలు ఈ చిత్రంలో అనుష్క గ్లామర్.. నవీన్ కామెడీ టైమింగ్ ఎలా ఉండబోతున్నాయి అనే ఉత్కంఠ తీరాలి అంటే, మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు ఆగాల్సిందే.