Begin typing your search above and press return to search.

ఎం.ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్.. ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్..!

గొప్ప వ్యక్తుల జీవిత కథలు వెండితెర మీద ఆవిష్కరించడం వారికి మనం ఇస్తున్న ఘన నివాళి అని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   22 May 2024 6:03 AM GMT
ఎం.ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్.. ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్..!
X

గొప్ప వ్యక్తుల జీవిత కథలు వెండితెర మీద ఆవిష్కరించడం వారికి మనం ఇస్తున్న ఘన నివాళి అని చెప్పొచ్చు. ఇప్పటికే ఎంతోమంది జీవిత కథలు తెర మీద చూపించే ప్రయత్నం చేశారు మన మేకర్స్. ఈ క్రమంలోనే ప్రముఖ గాయని సంగీతానికి చిరునామాగా మారిన ఎం.ఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత కథ సినిమాగా తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు దర్శక నిర్మాతలు ఎవరన్నది ఇంకా తెలియలేదు కానీ ఎం.ఎస్ సుబ్బలక్ష్మి పాత్రకు ఎవరు పర్ఫెక్ట్ అనే చర్చలు జరుగుతున్నాయి.

ఎం.ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ అనగానే తెర మీదకు వచ్చిన మొట్టమొదటి పేరు కీర్తి సురేష్. అప్పటివరకు కమర్షియల్ సినిమాల్లో అందరిలానే తన నటనతో ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్ మహానటి సినిమాతో అందరికీ షాక్ ఇచ్చింది. సావిత్రి గారిలా కీర్తి సురేష్ అభినయం ప్రేక్షకులందరినీ మెప్పించింది. మహానటి సినిమాలో కీర్తి సురేష్ తప్ప మరొకరిని ఊహించుకోవడం కష్టం అనిపించేలా చేసుకుంది. మహానటి లో కీర్తి సురేష్ అభినయానికి నేషనల్ వైడ్ గా ఒక రేంజ్ లో చర్చలు జరిగాయి. అఫ్కోర్స్ డైరెక్టర్ ఎంత కష్టపడినా తెర మీద తన నటనతో ఆకట్టుకుంది కీర్తి సురేష్. అందుకే జాతీయ ఉత్తమ నటిగా అవార్డ్ కూడా అందుకుంది కీర్తి సురేష్.

సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన మహానటి సినిమాను నాగ్ అశ్విన్ ఎంతో హృద్యంగా తెరకెక్కించారు. అందులో కీర్తి సురేష్ ప్రాణం పెట్టి నటించింది. అందుకే ఇప్పుడు ఎం.ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో కూడా కీర్తి సురేష్ పర్ఫెక్ట్ ఛాయిస్ అనేస్తున్నారు. చిన్ననాటి నుంచే సంగీతం మీద ఆసక్తితో ఎం.ఎస్ సుబ్బలక్ష్మి ఆ సంగీతమే తన ఊపిరిగా మార్చుకున్నారు. అలాంటి ఎం.ఎస్ గారి జీవిత కథ సినిమాగా తీస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉంటుంది.

ఒకవేళ ఆ సినిమా కీర్తి సురేష్ కాదంటే మాత్రం ఆ ఛాన్స్ నయనతార లేదా త్రిషకు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ ప్రభాస్ కల్కి లో బుజ్జి పాత్రకు తన వాయిస్ అందిస్తుంది. మరోపక్క బాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంది. ఎం.ఎస్ సుబ్బలక్ష్మిగా కీర్తి సురేష్ చేస్తే మాత్రం ఈ సినిమా మరో మహానటి అవుతుందని చెప్పడంలో సందేహం లేదు.