Begin typing your search above and press return to search.

మహేష్ 'ముఫాసా' - తొలి వారం కలెక్షన్ల సునామీ

సారిగా అదే క్రేజ్‌ను కొనసాగిస్తూ డిస్నీ నుండి విడుదలైన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ డిసెంబర్ 20, 2024న భారతదేశంలో విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

By:  Tupaki Desk   |   27 Dec 2024 7:00 AM GMT
మహేష్ ముఫాసా - తొలి వారం కలెక్షన్ల సునామీ
X

2019లో విడుదలైన ‘ది లయన్ కింగ్’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సారిగా అదే క్రేజ్‌ను కొనసాగిస్తూ డిస్నీ నుండి విడుదలైన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ డిసెంబర్ 20, 2024న భారతదేశంలో విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రం మొదటి వారంలోనే 74 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటింది.

ముఖ్యంగా భారతదేశంలో షారుక్ ఖాన్ (హిందీ), మహేశ్ బాబు (తెలుగు), అర్జున్ దాస్ (తమిళం) వంటి ప్రముఖ నటుల వాయిస్ ఓవర్స్ ఈ చిత్రానికి మరింత ఆకర్షణని తెచ్చిపెట్టాయి. హిందీ, తెలుగు, తమిళ భాషలలో కూడా భారీ ప్రేక్షకాదరణను పొందుతూ, అన్ని ప్రాంతాల్లో శక్తివంతమైన కలెక్షన్లను సాధించింది. మొదటి వారంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఇంగ్లీష్‌లో 26.75 కోట్లు, హిందీ లో 25 కోట్లు, తెలుగు లో 11.2 కోట్లు, తమిళంలో 11.3 కోట్లు సాధించి మొత్తం కలెక్షన్లను 74 కోట్లకు చేరవేసింది.

నాటకీయంగా రూపొందించిన కథ, అత్యాధునిక కంప్యూటర్ గ్రాఫిక్స్ తో కూడిన విజువల్స్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. క్రిస్మస్ సందర్భంగా విడుదలైన ఇతర సినిమాలకు గట్టి పోటీగా నిలిచిన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్ వంటి నేషనల్ థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ముఖ్యంగా ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా అన్ని వయసుల ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.

ఈ కథను బారీ జెంకిన్స రూపొందించారు. ఓ అనాథగా పుట్టిన ముఫాసా, తన స్నేహితులతో కలిసి ప్రైడ్ ల్యాండ్స్ రాజుగా ఎదిగే ప్రయాణాన్ని ఆకర్షణీయంగా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. లిన్-మాన్యువెల్ మిరాండా అందించిన పాటలు, తర్కసమర్థంగా తెరకెక్కిన స్క్రీన్‌ప్లే చిత్రం విజయవంతంగా నిలబడడానికి ముఖ్య కారణంగా నిలిచాయి.

తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో బ్లాక్‌బస్టర్ కలెక్షన్లు సాధిస్తున్న ఈ చిత్రం, కుటుంబ సభ్యులందరితో కలిసి చూడదగ్గ అద్భుత అనుభవంగా నిలుస్తోంది. భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి బ్రహ్మాండమైన ఆదరణ లభించడం విశేషం. సమకాలీన సినిమాలకు ఇది సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ, డిస్నీ చిత్రాల ట్రేడ్ మార్క్ సినిమాగా నిలిచింది. ఇకపై వచ్చే వారాల్లో కూడా ఇదే వేగాన్ని కొనసాగిస్తూ, బాక్సాఫీస్ వద్ద మరిన్ని కలెక్షన్స్ ను నమోదు చేయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.