అప్పుడు నాని, ఇప్పుడు మహేష్‌బాబు... ముఫాసా క్రేజ్ డబుల్
నానితో పాటు అలీ, జగపతిబాబు ఇంకా ప్రముఖులు సైతం ది లయన్ కింగ్ తెలుగు కోసం డబ్బింగ్ చెప్పడం జరిగింది.
By: Tupaki Desk | 20 Nov 2024 8:32 AM GMT2019లో వచ్చిన ది లయన్ కింగ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. తెలుగులో ఈ సినిమా క్రేజ్ ని పెంచే విధంగా సింబా పాత్రకు నానితో డబ్బింగ్ చెప్పించారు. నానితో పాటు అలీ, జగపతిబాబు ఇంకా ప్రముఖులు సైతం ది లయన్ కింగ్ తెలుగు కోసం డబ్బింగ్ చెప్పడం జరిగింది. తెలుగు తో పాటు అన్ని భాషల్లోనూ ది లయన్ కింగ్ సూపర్ హిట్‌గా నిలిచింది. అయిదు ఏళ్ల తర్వాత ది లయన్ కింగ్ కు ప్రీక్వెల్‌గా రూపొందిన 'ముఫాసా : ది లయన్ కింగ్' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ది లయన్ కింగ్ సినిమాకు నానితో డబ్బింగ్ చెప్పించిన మేకర్స్ ఈసారి ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబును రంగంలోకి దించబోతున్నారు. ముఫాసా పాత్ర కోసం మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడంతో ముఫాసా క్రేజ్ డబుల్ కావడం ఖాయం అని, తెలుగులో భారీ ఎత్తున వసూళ్లు సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మహేష్ బాబు డబ్బింగ్‌తో రాబోతున్న ముఫాసా అంటూ ప్రచారం మొదలు కావడంతో అంచనాలు, ఆసక్తి పెరిగాయి.
విడుదలకు ఇంకా నెల సమయం ఉండగానే ముఫాసా కోసం నెటిజన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం, ఇంకా ఎప్పుడు వస్తుంది అంటూ ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ ఈ సినిమాలో భాగం కావడంతో తెలుగులో విజయం పక్కా అని తేలిపోయింది. ముఫాసాలో ఆసక్తికర సన్నివేశాలు ఉంటాయని.. మహేష్ బాబు డబ్బింగ్‌తో సినిమా స్థాయి మరింతగా పెరిగింది అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ముఫాసా : ది లయన్ కింగ్ కోసం కేవలం మహేష్ బాబు మాత్రమే కాకుండా పుంబా పాత్ర కోసం బ్రహ్మానందం, టిమోన్ పాత్ర కోసం అలీ, టకా పాత్ర కోసం సత్యదేవ్ ఇంకా కీలక పాత్ర కోసం అయ్యప్ప పి శర్మ లు డబ్బింగ్ చెప్పడం జరిగింది. డిసెంబర్‌లో నిర్వహించబోతున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మహేష్ బాబు మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నా ఈ సినిమాతో ఒప్పందం చేసుకున్న కారణంగా మహేష్ బాబు ఒకటి లేదా రెండు సార్లు మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.