Begin typing your search above and press return to search.

మ‌హేష్ ఫ్యామిలీ కూడా మొత్తం దిగుతుందా?

హాలీవుడ్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ `ముఫాసా` బాలీవుడ్ డ‌బ్బింగ్ బాద్య‌త‌లు మొత్తం కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఫ్యామిలీ తీసుకున్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   16 Aug 2024 11:55 AM GMT
మ‌హేష్ ఫ్యామిలీ కూడా మొత్తం దిగుతుందా?
X

హాలీవుడ్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ `ముఫాసా` బాలీవుడ్ డ‌బ్బింగ్ బాద్య‌త‌లు మొత్తం కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఫ్యామిలీ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. సింబ పాత్ర‌కు షారుక్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్, చిన్న కుమారుడు అబ్రామ్ ఖాన్ యువ ముఫాసాకు, ముఫాసా పాత్ర‌కు షారుఖ్ గాత్ర దానం చేస్తున్నారు. ఈ ముగ్గురి ఎంట్రీతో ముఫాసాకి ఎన‌లేని క్రేజ్ వచ్చేసింది. అస‌లే హిట్ కంటెంట్ కావ‌డం స‌హా కింగ్ ఖాన్ ఫ్యామిలీ కూడా తోడవ్వ‌డంతో సినిమాపై అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ట్రైల‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. యూ ట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకు పోతుంది. నార్త్ వ‌ర‌కూ ముఫాసా వేగం మామూలుగా లేద‌నే చెప్పాలి. మ‌రి సౌత్ లో ...అందులోనూ తెలుగులో ఆ బాధ్య‌త‌లు తీసుకునేది ఎవ‌రు? అంటే సూప‌ర్ స్టార్ మ‌హేష్ ని రంగంలోకి దించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు వెలుగులోకి వచ్చింది. ముఫాసా పాత్ర‌కు మహేష్ బాబుతో డ‌బ్బింగ్ చెప్పించాల‌ని మేక‌ర్స్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారుట‌.

అదే నిజ‌మైతే మేక‌ర్స్ మ‌హేష్ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా దించినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. సితార‌కు సినిమాలంటే పిచ్చి. డాన్సులు ఇర‌గ‌దీస్తుంది. హాలీవుడ్ సినిమాకి డ‌బ్బింగ్ చెప్పే అవ‌కాశం వ‌స్తే ఎందుకు వ‌దులుకుంటుంది? డాడ్ కూడా అంతే ప్రోత్స‌హిస్తారు. ఇక గౌత‌మ్ యాక్టివ్ గా లేక‌పోయినా? ఇది రేర్ ఛాన్స్ కాబ‌ట్టి ఛాన్స్ తీసుకునే అవ‌కాశం లేక‌పోలేదు. మ‌హేష్ ఎలాగూ అవ‌స‌రమైన‌ప్పుడ‌ల్లా స్నేహితుల కోసం అప్పుడ‌ప్పుడు డ‌బ్బింగ్ చెబుతుంటాడు.

ముఫాసా లాంటి సినిమాకి గాత్ర దానం చేస్తే అది మ‌రింత గుర్తింపును తీసుకొస్తుంది. మ‌రి షారుక్ ఫ్యామిలీ లా..మ‌హేష్ ఫ్యామిలీ దిగుతుందా? లేదా? అన్న‌ది చూడాలి. ముందు వెర్ష‌న్ ల‌య‌న్ కింగ్ లోని సింబా పాత్ర‌కు నేచుర‌ల్ స్టార్ నాని డ‌బ్బింగ్ చెప్పిన సంగ‌తి తెలిసిందే.