Begin typing your search above and press return to search.

అనుష్క భ‌ర్త‌పై కాస్టింగ్ డైరెక్ట‌ర్ సంచ‌న‌ల వ్యాఖ్య‌లు!

విరాట్ కోహ్లీ టీమ్ ఇండియాని ఏల్తోన్న సంగ‌తి తెలిసిందే. లెజెండ‌రీ క్రికెట‌ర్ల స‌ర‌స‌న త‌ను ఓ స్థానం సంపాదించాడు

By:  Tupaki Desk   |   22 Aug 2024 9:30 AM GMT
అనుష్క భ‌ర్త‌పై కాస్టింగ్ డైరెక్ట‌ర్ సంచ‌న‌ల వ్యాఖ్య‌లు!
X

విరాట్ కోహ్లీ టీమ్ ఇండియాని ఏల్తోన్న సంగ‌తి తెలిసిందే. లెజెండ‌రీ క్రికెట‌ర్ల స‌ర‌స‌న త‌ను ఓ స్థానం సంపాదించాడు. గొప్ప బ్యాట్స్ మెన్ గా ప్ర‌పంచ‌స్థాయి దిగ్గ‌జాల‌తోనే ప్ర‌శంస‌లందుకున్నాడు. క్రికెట్ లో అత‌డి ఎదిగిన విధానం...అత‌డి బాల్యం ప్ర‌తీది ఎంతో స్పూర్తిదాయ‌కంగా ఉంటుంది. అలాగే బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ‌తో ప్రేమ వివాహం...అంత‌కు ముందు క‌లిసి ప్ర‌క‌ట‌న చేయ‌డం.

ఇలా కోహ్లీ జ‌వితంలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. తీస్తే అద్భుత‌మైన బ‌యోపిక్ అవుతుంది. ఇక కొంత మంది ప్లేయ‌ర్లు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న త‌ర్వాత మ్యాక‌ప్ వేసుకుని తెర మీద క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే కొహ్లీని మాత్రం అలాంటి సాహ‌సాలు చేయోద్ద‌ని ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేసాడు కాస్టింగ్ డైరెక్ట‌ర్ ముఖేష్ చాబ్రా. `ఢిల్లీ నుంచి వ‌చ్చిన ఈ పంజాబీ ప్లేయ‌ర్ జీవితాన్నే చ‌దివేశాడు.

మంచి అంద‌గాడు. ఫిట్ నెస్ ప్రియుడు..సిక్స్ ప్యాక్ అన్ని బాగుంటాయి. అన్నింటింని మంచి ఎంతో తెలివైనవాడు. ఎంతో స‌ర‌దాగా ఉంటాడు. మంచి డాన్సు చేస్తాడు. మిమీక్రి కూడా చేస్తాడు. అత‌డి కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. దేశాన్ని గ‌ర్వ‌ప‌డే స్థాయికి తీసుకెళ్లాడు. కానీ అత‌డు ఇష్ట‌ప‌డి ఎంచుకున్న క్రీడా రంగంలో కొన‌సాగాలి త‌ప్ప సినిమాల్లోకి వ‌చ్చే ప్ర‌య‌త్నం మాత్రం చేయ‌కూడ‌దు.

రిటైర్మెంట్ త‌ర్వాత రంగుల ప్ర‌పంచం వైపు రాకపోతేనే బెట‌ర్ ` అన్నాడు. మ‌రి చాబ్రా ఇలా ఎందుకు అన్నాడు? అన్న దానికి మాత్రం కార‌ణాలు లేవు. కోహ్లీ భార్య అనుష్క బాలీవుడ్ లో పెద్ద న‌టి. నిర్మాత‌గానూ రాణిస్తుంది. ఇద్ద‌రు జంట‌గా ఎన్నో యాడ్స్ చేసారు. ఆ పెయిర్ కి ఆన్ స్క్రీన్ పై మంచి క్రేజ్ ఉంది. ఆ కాంబోలో ఓ సినిమా చూడాలని అభిమానులు ఆశ‌ప‌డుతున్నారు. రిటైర్మెంట్ త‌ర్వాత బాలీవుడ్ కి వ‌స్తే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి కొహ్లీతో ఈ క్యాస్టింగ్ డైరెక్ట‌ర్ కి వ‌చ్చిన స‌మ‌స్య ఏంటో.