రాముడిగా రణబీర్.. అతనే ఎందుకంటే?
భారతీయులకి రామాయణం కథ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
By: Tupaki Desk | 21 Aug 2024 10:30 AM GMTభారతీయులకి రామాయణం కథ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఉండే ప్రతి పాత్రతో కూడా ఇండియన్స్ ఎంతో అనుబంధం కలిగి ఉంటారు. ముఖ్యంగా హిందుత్వాన్ని విశ్వసించే వారికి రామాయణం ఒక పవిత్ర గ్రంథం. అందుకే వాల్మీకి రామాయణంలో ఉన్నది ఉన్నట్లు కాకుండా ఎవరు సొంత అన్వయాలు జోడించి కథలు చెప్పిన అంత ఈజీగా యాక్సప్ట్ చేయరు.
ఈ రామాయణం కథని అన్ని భాషలలో సినిమాలు, సీరియల్స్ రూపంలో చాలా సార్లు చూసేసారు. ఈ సారి టెక్నాలజీ, విజువల్ ఎఫెక్ట్స్ ని ఉపయోగించుకొని రామాయణం కథని మరింత అద్భుతంగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించడానికి నితీష్ తివారి సిద్ధం అయ్యారు. అల్లు అరవింద్ తో కలిసి ఆయన ఒక నిర్మాతగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణుడిగా రాకింగ్ స్టార్ యష్ ని ఎంపిక చేశారు. ఈ సినిమా టెస్ట్ షూట్ కూడా చేశారు. త్వరలో మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతుందనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో టైటిల్ రోల్ అయిన రాముడి పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ని ఎంపిక చేయడానికి కారణం ఏమై ఉంటుంది అనేదానికి బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ చాబ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాముడి క్యారెక్టర్ ని చేయాల్సిన వారికి ఉండాల్సిన లక్షణం ప్రశాంతత. రణబీర్ కపూర్ కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. జయాపజయాలని అతను ఒకే విధంగా చూస్తాడు. రణబీర్ కపూర్ తో కలిసి చాలా ప్రాజెక్ట్స్ కి నేను వర్క్ చేశాను. ఆయన రాముడి పాత్రకి పెర్ఫెక్ట్ ఛాయస్. అందుకే నితీష్ తివారి కూడా రణబీర్ కపూర్ ని రాముడి క్యారెక్టర్ కోసం ఎంపిక చేసుకొని ఉంటారు.
రాముడి పాత్రలో ఆయన కంటే గొప్పగా ఎవరూ చేయలేరని నా ఫీలింగ్. నటనలో రణబీర్ తో ఎవరూ పోటీ పడలేరని దర్శకుడు ముఖేష్ చాబ్రా అన్నారు. రణబీర్ లుక్ చూస్తుంటే రాముడి పాత్రకి ఆయన పెర్ఫెక్ట్ గా సెట్ అయినట్లే కనిపిస్తోంది. అలాగే సాయి పల్లవి కూడా సీతాదేవి పాత్రలో ఉండే కరుణరసాన్ని అద్భుతంగా పలికించగలుగుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.