పాన్ మసాలా యాడ్స్ చేయొద్దని తిట్టాను: నటుడు ముఖేష్ ఖన్నా
పొగాకు ఉత్పత్తులు అత్యంత ప్రమాదకరం. క్యాన్సర్ కారకాలు. అయినా ప్రజలు సెలబ్రిటీల ప్రచారాన్ని నమ్మి మోసపోతున్నారు.
By: Tupaki Desk | 12 Aug 2024 3:40 AM GMTపొగాకు ఉత్పత్తులు అత్యంత ప్రమాదకరం. క్యాన్సర్ కారకాలు. అయినా ప్రజలు సెలబ్రిటీల ప్రచారాన్ని నమ్మి మోసపోతున్నారు. స్టార్లు ప్రకటనల్లో నటించి అమాయక ప్రజలను తప్పుదారి పట్టించడంపై చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. గత ఏడాది పొగాకు బ్రాండ్ విమల్ కోసం షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్‌లతో కూడిన ప్రకటన ఎయిర్ లోకి రాగానే అభిమానులు దానిని తీవ్రంగా తప్పు పట్టారు. పొగాకును ప్రోత్సహిస్తున్నందుకు సోషల్ మీడియా వినియోగదారులలో ఒక వర్గం ఇందులో నటించిన స్టార్లను నిందించింది.
ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై సూటిగా అభిప్రాయాలు చెప్పడంలో పేరుగాంచిన నటుడు ముఖేష్ ఖన్నా బాలీవుడ్ బబుల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారిపై విరుచుకుపడ్డాడు. డబ్బాశతో ఇలాంటి ప్రకటనలు చేస్తున్న తారలపై కోపంగా స్పందించాడు. నేను అక్షయ్ కుమార్‌ని కూడా తిట్టాను అని ముఖేష్ అన్నారు. పెద్ద స్టార్లు ఇలాంటి ప్రకటనలు చేసే ముందు మరింత బాధ్యతగా ఉండాలని భావిస్తున్నారా? అని ప్రశ్నించగా..ముఖేష్ ఇలా అన్నారు. ``నన్ను అడిగితే వారిని పట్టుకుని తన్నండి అని అంటాను. ఈ విషయం వారితో చెప్పాను. నేను అక్షయ్ కుమార్‌ని కూడా తిట్టాను. అతడు ఆరోగ్యానికి అంబాసిడర్ అయితే అతను `ఆదాబ్` అని చెప్పాడు. అజయ్ దేవగన్ `ఆదాబ్` అని చెప్పాడు. ఇప్పుడు షారూఖ్ ఖాన్ కూడా అదే చేస్తున్నాడు. ఈ ప్రకటనల తయారీకి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. మరి మీరు ప్రజలకు ఏం బోధిస్తున్నారు?.. వారు అంటున్నారు.. మేము పాన్-మసాలా అమ్మడం లేదని... వారు దానిని సుపారీ (బీటిల్ నట్) అంటున్నారు. కానీ వారు ఏం చేస్తున్నారో వారికి తెలుసు!.. అని స్టార్లను సూటిగా విమర్శించారు.
మీరు కింగ్‌ఫిషర్ ప్రకటన చేస్తే.. కింగ్‌ఫిషర్ బీర్‌ను విక్రయిస్తున్నారని అర్థం. ఇది అందరికీ తెలుసు. కొన్నిటిని మోసపూరిత ప్రకటనలు అంటారు. స్టార్లు ఇలాంటి ప్రకటనలు ఎందుకు చేస్తారు? వాళ్ల దగ్గర డబ్బు లేదా? నేను వారికి ఈ విషయం చెప్పాను. ఈ పనులు చేయవద్దు.. మీకు చాలా డబ్బు ఉంది.. అని అన్నాను. అది తప్పు కాకపోతే అమితాబ్ బచ్చన్ కూడా ఇలాంటి ప్రచారానికి దూరమయ్యారు. ఈ రోజు వరకు ఈ ప్రకటనల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు... ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటున్నారు. కేసరియా జబాన్ (కుంకుమ నాలుక)? కోసం మీరు గుట్కా తినమని ప్రజలకు నేర్పుతారా? అని ముఖేష్ సీరియస్ అయ్యారు.
వారిని తిట్టడమే కాదు.. తాను కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించానని తెలిపారు ముఖేష్ ఖన్నా. ఇలాంటి ప్రకటనల కోసం తనను కూడా సంప్రదించారని.. అయితే తాను వాటికి ఓకే చెప్పలేదని ముఖేష్ పేర్కొన్నాడు. ప్రేక్షకులు వాటిని చూసి అనుకరిస్తారు కాబట్టి వీటిని చేయడం మానేయాలని ఆయన స్టార్‌లను కోరారు.