జై హనుమాన్ కోసం ప్రశాంత్ వర్మ భారీ ప్లాన్..
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న జై హనుమాన్ సినిమా పై విపరీతమైన బజ్ నెలకొంది.
By: Tupaki Desk | 2 April 2025 6:30 PMడైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న జై హనుమాన్ సినిమా పై విపరీతమైన బజ్ నెలకొంది. హను మాన్ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో దానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆల్రెడీ హను మాన్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన ప్రశాంత్ వర్మ జై హనుమాన్ తో దాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు.
అందులో భాగంగానే ఈ సినిమాను కేవలం విజువల్ స్పెక్టక్యులర్ గా మాత్రమే కాకుండా ఒక గొప్ప మైథలాజికల్ మల్టీస్టారర్ గా తెరకెక్కిస్తున్నాడట ప్రశాంత్ వర్మ. ఈ నేపథ్యంలోనే జై హనుమాన్ లో కేవలం హనుమంతుని కథతో పాటూ మరో ఏడుగురు చిరంజీవుల కథను కూడా ప్రశాంత్ వర్మ చూపంచబోతున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
జై హనుమాన్ లో హనుమంతుని పాత్రతో పాటూ అశ్వత్థామ, బలి చక్రవర్తి, విభీషణుడు, కృపాచార్య, పరశురాముడు, వ్యాసుడు కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ పాత్రల కోసం వివిధ సినీ పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలతో ప్రశాంత్ వర్మ డిస్కషన్స్ చేస్తూ వారిని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడని సమాచారం. అదే నిజమైతే టాలీవుడ్ లో ఇంతకుముందెన్నడూ చూడని గ్రాండ్ మైథలాజికల్ మల్టీస్టారర్ గా ఇది హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం.
ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న జై హనుమాన్ సినిమాను సరిగా హ్యాండిల్ చేయగలిగితే మహా భారతం లెవెల్ లో ఓ ఇతిహాసంలా తీయొచ్చు. అందుకే తనకొచ్చిన ఈ ఛాన్స్ ను సరిగా వాడుకుని ప్రతీ పాత్రకు న్యాయం చేసేలా స్క్రీన్ ప్లే విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తున్నాడట ప్రశాంత్ వర్మ. హను మాన్ లానే ఈ సినిమా కూడా విజువల్ వండర్ గా ఉండనుందని తెలుస్తోంది.
ఈ సినిమా నిర్మాణంలో భాగమవ్వడానికి సౌత్, నార్త్ లోని పలు అగ్ర నిర్మాణ సంస్థలు రెడీగా ఉన్నాయి. జై హనుమాన్ ను ప్రశాంత్ వర్మ పాన్ ఇండియన్ లెవెల్ లో ఎమోషన్స్, భక్తి, గ్రాండ్ విజువల్స్ తో ప్రెజెంట్ చేసి ఆడియన్స్ కు ఎప్పటికీ మర్చిపోలేని సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ను ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ఇండియన్ సినిమాలో జై హనుమాన్ కొత్త బెంచ్‌మార్క్ ను సెట్ చేయడం ఖాయం.