Begin typing your search above and press return to search.

ఇండియన్ 2.. మరో తలనొప్పి మొదలైంది

కమల్ హాసన్ లీడ్ రోల్ లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండియన్ 2 మూవీ జులై 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.

By:  Tupaki Desk   |   29 Aug 2024 9:30 PM GMT
ఇండియన్ 2.. మరో తలనొప్పి మొదలైంది
X

కమల్ హాసన్ లీడ్ రోల్ లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండియన్ 2 మూవీ జులై 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాకి మొదటి ఆట నుంచే డివైడ్ టాక్ వచ్చింది. రిలీజ్ అయిన అన్ని భాషలలో కూడా మూవీకి ఫ్లాప్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఓవరాల్ గా ఈ సినిమా 150 కోట్ల కలెక్షన్స్ మాత్రమే లాంగ్ రన్ లో వసూలు చేసింది. శంకర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా ఈ చిత్రం మారింది.

అయితే హిందీలో రిలీజ్ అయ్యే ఏ సినిమా అయిన కూడా మల్టీప్లెక్స్ లో రిలీజ్ అయిన 8 వారాల తర్వాత ఒటీటీలో రిలీజ్ చేసుకోవాలి. ఈ అగ్రిమెంట్ కి ఒకే అయితేనే మల్టీ ప్లెక్స్ లో సినిమాకి రిలీజ్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. ఒకవేళ ఈ అగ్రిమెంట్ కి ఒప్పుకోకపోతే మేజర్ మల్టీప్లెక్స్ చైన్స్ అయిన పీవీఆర్, సినీపోలిస్ లలో రిలీజ్ చేసే అవకాశం ఉండదు. చాలా మంది ఈ అగ్రిమెంట్ కి ఒకే చెబుతారు. మేగ్జిమమ్ హిందీ సినిమాలు అన్ని కూడా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పెట్టే ఈ రూల్స్ ని తప్పకుండా ఫాలో అవుతాయి.

వీటిని అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకునే హక్కు వారికుంటుంది. ఇదిలా ఉంటే ఇండియన్ 2 మూవీ హిందీలో హిందుస్తానీ2 గా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా మల్టీప్లెక్స్ లలో రిలీజ్ చేయడానికి లైకా ప్రొడక్షన్స్ వారి అగ్రిమెంట్, రూల్స్ కి ముందుగా ఒప్పుకుంది. తరువాత ఈ రూల్స్ బ్రేక్ చేసి ఇండియన్ 2 సినిమా హిందీ వెర్షన్ ని నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. ఎనిమిది వారాల గడుపు పూర్తికాకముందే ఒటీటీలో రిలీజ్ చేయడంపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అగ్రిమెంట్ రూల్స్ బ్రేక్ చేసి ముందుగానే ఒటీటీలో ఇండియన్ 2 హిందీ వెర్షన్ రిలీజ్ చేసినందుకు లైకా ప్రొడక్షన్స్ ని లీగల్ నోటీసులు ఇచ్చారు. దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం అయితే ఇండియన్ 2 హిందీ వెర్షన్ ని సెప్టెంబర్ 6న ఒటీటీలో రిలీజ్ చేయాలి. అయితే అన్ని భాషలతో పాటు హిందీ వెర్షన్ కూడా ఒటీటీలో రిలీజ్ చేసేశారు.

ఇప్పుడు ఇండియన్ 2 నిర్మాతలపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో చాలా మంది వారిని ఫాలో అయ్యే అవకాశం ఉందని ముందుగానే మల్టీ ప్లెక్స్ అసోసియేషన్ అలెర్ట్ అయ్యింది. హెచ్చరికగా లీగల్ నోటీసులు జారీ చేసింది. పాన్ ఇండియా సినిమా ఏదైనా నార్త్ ఇండియాలో మల్టీప్లెక్స్ లో రిలీజ్ చేయాలంటే నిబంధనలని ఫాలో అవ్వాల్సిందే. మరి ఈ లీగల్ నోటీసులకి లైకా, రెడ్ జెయింట్స్ నిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి.