Begin typing your search above and press return to search.

మళ్లీ రూ.99 కి మల్టీప్లెక్స్‌ ఎంట్రీ...!

ఇండియాలో సినిమా లవర్స్ డే అంటూ ప్రతి ఏడాది మే 31న జరుపుకుంటున్నాం

By:  Tupaki Desk   |   29 May 2024 11:39 AM GMT
మళ్లీ రూ.99 కి మల్టీప్లెక్స్‌ ఎంట్రీ...!
X

ఇండియాలో సినిమా లవర్స్ డే అంటూ ప్రతి ఏడాది మే 31న జరుపుకుంటున్నాం. అన్ని సినిమా ఇండస్ట్రీలకు చెందిన వారు కూడా ఆ ప్రత్యేక రోజును ఏదో ఒక విధంగా జరుపుకోవడం జరుగుతుంది. గత కొన్నాళ్లుగా దేశంలోని అన్ని మల్టీప్లెక్స్‌ ల్లో కూడా ఆ ప్రత్యేక రోజున రూ.99 లకి ఎంట్రీ ఇస్తున్నారు.

గత ఏడాది కూడా దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ డే సందర్భంగా మల్టీ ప్లెక్స్‌ ల్లో రూ.99 లకే టికెట్లు అమ్మడం జరిగింది. దాంతో పెద్ద ఎత్తున టికెట్లు అమ్మకం జరిగింది. ఆ రోజు అన్ని షో లకు కూడా దాదాపుగా హౌస్‌ ఫుల్‌ కలెక్షన్స్‌ వచ్చాయి అంటూ మల్టీప్లెక్స్‌ చైన్‌ యాజమాన్యాలు ప్రకటించాయి.

ఈసారి కూడా మే 31వ తారీకున దేశ వ్యాప్తంగా పీవీఆర్‌ - ఐనాక్స్‌, సినీ పొలిస్, సిటీ ఫ్రెడ్స్, ఏషియన్‌, మిరాజ్‌, మూవీ టైమ్‌ ఇతర మల్టీప్లెక్స్‌ ల్లో 99 రూపాయల టికెట్ లను అందుబాటులో ఉంచబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

గత నెల రోజులుగా ఎన్నికలు ఇతర హడావుడి కారణంగా థియేటర్‌ లు వెలవెల బోతున్నాయి. చిన్న సినిమాలు విడుదల అయినా కూడా జనాలు పట్టించుకోవడం లేదు. జూన్ లో పెద్ద సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి.

మే 31న కూడా చిన్న సినిమాలే ఉంటాయి. అయిన కూడా రూ.99 లకే టికెట్‌ ఎఫెక్ట్‌ కారణంగా చిన్న సినిమాలకు కూడా మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సామాన్యులు ఆ ఒక్క రోజు అయినా మల్టీ ప్లెక్స్ లోకి వెళ్లడం అనేది హర్షించదగ్గ విషయం.