విశాల్ లంచం ఆరోపణలపై రంగంలోకి సీబీఐ
ముంబై సెన్సార్ బోర్డ్ పై కోలీవుడ్ నటుడు విశాల్ లంచం తీసుకున్నారంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ఇప్పటికే కేంద్ర సెన్సార్ బోర్డ్ చైర్మన్ కూడా స్పందించారు
By: Tupaki Desk | 5 Oct 2023 10:01 AM GMTముంబై సెన్సార్ బోర్డ్ పై కోలీవుడ్ నటుడు విశాల్ లంచం తీసుకున్నారంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ఇప్పటికే కేంద్ర సెన్సార్ బోర్డ్ చైర్మన్ కూడా స్పందించారు. తప్పు ఎక్కడ ? ఎలా జరిగిందో కనుగునే ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఈ నేపథ్యంలో నిన్నటి రోజున హుటాహుటిన సమావేశ మయ్యారు. నిజంగా అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కేసు విచారణకు సంబంధించి ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా వేసారు. ఈనేపథ్యంలో తాజాగా ఈ కేసు విషయంలో సీబీఐ కూడా రంగంలోకి దిగింది.
ముంబై సెన్సార్ బోర్డ్ పై కేసు నమోదు చేసింది. దీంతో ముంబై సెన్సార్ బోర్డ్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే విశాల్ లంచం ఇచ్చింది థర్డ్ పార్టీ వ్యక్తులకంటూ ముంబై సెన్సార్ బోర్డ్ ఖండించిం ది. ఈ వివాదంలో తమకెలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. తాజాగా సీబీఐ ఎంట్రీతో సన్నివేశం మరింత రసవత్తరంగా సాగింది. విశాల్ లంచం ఇస్తున్న వీడియోలు కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
అలాగే ప్రధాని మోదీ...మహరాష్ట్ర సీఎం ఏక్ నాధ్ షిండేలకు ఈ అవినీతి విషయాన్ని చేరవేసారు. విశాల్ పిర్యాదు నేపథ్యంలో సీబీఐ కేసు నమోదు చేసింది. ముగ్గురు వ్యక్తులతో పాటు..ముంబై సీబీఎఫ్ సీకి చెందిన వ్యక్తులు..మరికొందరిపై సీబీఐ విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. విశాల్ నటించిన `మార్క్ ఆంటోనీ` సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ లో భాగంగా మొత్తం 6.5 లక్షలు లంచం చెల్లించినట్లు విశాల్ ఆరోపించారు.
అందులో 3 లక్షలు స్క్రీనింగ్ కు....మిగతా మొత్తం సర్టిఫికెట్ కోసం చెల్లించినట్లు విశాల్ తెలిపారు. తను నిర్మాతగా అన్ని సినిమాలు చేసినా ఏ సెన్సార్ బోర్డ్ తోనూ ఇలాంటి సమస్యరాలేదని..ముంబై సెన్సార్ తోనే తొలిసారి ఇలాంటి అనుభవం ఎదురైందని ఆవేదన చెందారు.