Begin typing your search above and press return to search.

మమ్మీ జీ సాంగ్.. అదరగొట్టిన మౌనీరాయ్

ఈ మధ్యకాలంలో హిందీ సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యి సక్సెస్ అందుకుంటున్నాయి.

By:  Tupaki Desk   |   7 Aug 2024 11:00 AM GMT
మమ్మీ జీ సాంగ్.. అదరగొట్టిన మౌనీరాయ్
X

ఈ మధ్యకాలంలో హిందీ సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యి సక్సెస్ అందుకుంటున్నాయి. గత ఏడాది షారుఖ్ ఖాన్ నుంచి వచ్చిన పఠాన్, జవాన్ సినిమాలు రెండు కూడా తెలుగులో సూపర్ హిట్ అయ్యాయి. యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథలతో తెరకెక్కే సినిమాలకి తెలుగులో మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే జాన్ అబ్రహం హీరోగా నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో తెరకెక్కిన హైవోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ వేదా.

ఈ సినిమా తెలుగులో కూడా అదే పేరుతో రిలీజ్ అవుతోంది. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కి మంచి స్పందన వస్తోంది. ఆగష్టు 15న ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు. ఇదలా ఉంటే ఈ సినిమా నుంచి తాజాగా మమ్మీ జీ అంటూ సాగే ఐటెం సాంగ్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ సాంగ్ కి మనన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

యనమంద్ర రామకృష్ణ తెలుగులో లిరిక్స్ ని రాశారు. ఈ సాంగ్ లో మౌనీ రాయ్ గ్లామర్ షో ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. సాంగ్ కూడా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. మౌనీరాయ్ కోసం ఈ సాంగ్ ని చూస్తున్నాం అంటూ మెజారిటీ తెలుగు ఆడియన్స్ కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం. దీనిని బట్టి ఈ బ్యూటీకి తెలుగులో ఎంత ఆదరణ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అయితే వేదా మూవీ కాన్సెప్ట్ కూడా చాలా ఇంటరెస్టింగ్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇందులో జాన్ అబ్రహం ఆర్మీ సోల్జర్ గా నటిస్తున్నాడు. అలాగే ఒక గ్రామంలో ప్రజలని పీడించే విలన్ కి వ్యతిరేకంగా అతను పోరాటం చేస్తాడని తెలుస్తోంది. సర్వారి, తమన్నా భాటియా ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే సర్వారి పాత్ర మూవీలో చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది.

ఈ మధ్యకాలంలో సర్వారి బాలీవుడ్ వరుస సినిమాలలో అవకాశాలు సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. అసీమ్ అరోరా వేదా సినిమాకి కథ అందించారు. గత ఏడాది షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాలో ప్రతినాయకుడిగా జాన్ అబ్రహం ప్రేక్షకుల ముందుకొచ్చారు. జీ స్టూడియోస్, ఎమ్మాయ్ ఎంటర్టైన్మెంట్, జె.ఏ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్ అబ్రహం మూవీకి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.