నొప్పి భరించలేక సూసైడ్ చేసుకుందామనుకున్నా!
తమిళ్ ఇండస్ట్రీలో కెరీర్ ఆరంభించిన ఆమె.. తెలుగుతో పాటు.. హిందీ- కన్నడ- మలయాళం చిత్రాల్లో నటించి మెప్పించింది.
By: Tupaki Desk | 6 April 2024 4:58 AM GMT`ఖుషీ`లో పవన్ కళ్యాణ్ సరసన మెరిసిన ముంతాజ్ సుపరిచితమే. అందులో హీరోయిన్ గా నటించింది భూమిక అయినా...ఆ సినిమాతో అంతకు మంచి హైలైట్ అవుతుంది ముంతాజ్. అంతకు మించి అందగత్తె..హాట్ బ్యూటీ కావడంతో ముంతాజ్ ని మర్చిపోయే అభిమానులుంటారా? నటిగా అమ్మడికి అదే తొలి సినిమా. ఆమె అసలు పేరు నగ్మా ఖాన్. అప్పట్లో తెలుగు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ తో అలరించేది.
తమిళ్ ఇండస్ట్రీలో కెరీర్ ఆరంభించిన ఆమె.. తెలుగుతో పాటు.. హిందీ- కన్నడ- మలయాళం చిత్రాల్లో నటించి మెప్పించింది. వెంకటేష్ సరసన `జెమినీ` సినిమాలోను స్పెషల్ సాంగ్ చేసింది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన `అత్తారింటికి దారేది` చిత్రంలో మరోసారి స్పెషల్ సాంగ్ చేసింది. ఈ పాట కోసం పవన్ ఆమెని కావాలని మరీ సీన్ లోకి తెచ్చారు. అప్పటికే అవకాశాలు లేక ఖాళీగా ఉంటోన్న ముంతాజ్ ని పిలిపించి సహాయంగా అవకాశం కల్పించారు.
కానీ ఆ తర్వాత కూడా పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఆమె పెళ్లి చేసుకుని కుటుంబ జీవితానికి అంకితమై ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె ఇంతవరకూ పెళ్లి చేసుకోలేదు అన్న సంగతి ఎంత మందికి తెలుసు. అవును ఇది నిజం.. ఆమె పెళ్లి గురించి...ఆరోగ్యం గురించి అమ్మడు ఆసక్తికర విషయాలు రివీల్ చేసింది. అవేంటో ఆమె మాటల్లోనే... నేను అరుదైన ఓ వ్యాధితో బాధపడుతున్నా. దాని పేరు ఆటో ఇమ్యూన్. ఈ వ్యాధి కారణంగా ఎముకల జాయింట్ లో భయంకరమైన నొప్పి వస్తుంది.
నాకు అన్నయ్య సహకారం లేకపోతే ఆత్మహత్య చేసుకునేదాన్ని. ఇప్పటికే నాకు 43 ఏళ్లు వచ్చాయి. పెళ్లి అవుతుందనే నమ్మకం కూడా లేదు` అని ఆవేదన చెందింది. దీంతో ఆమె వ్యాఖ్యలకు నెటి జనులు ధైర్యం చెబుతున్నారు. ముంతాజ్ స్థితిని చూసి అధైర్య పడవద్దు అని ఆరోగ్యం కుదుటపడుతుందని పోస్టులు పెడుతున్నారు.